ప్రేమించి పెళ్లి చేసుకున్న సింగర్ మధుప్రియ భర్తకు డివోర్స్ ఇవ్వడానికి కారణం..?

“ఆడపిల్ల ఆడపిల్లా ఆడపిల్లనటా నేను పాడు పిల్లానటా” అంటూ పాట వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది సింగర్ మధుప్రియ ( Madhupriya ) మాత్రమే.ఈ ఒక్క పాటతో ఆమె ఎంతగానో ఫేమస్ అయ్యింది.

 Reason For Divorcing Singer Madhupriya's Husband , Singer Madhupriya, Husband ,-TeluguStop.com

ఇదంతా పక్కన పెడితే మధుప్రియ తన గొంతుతో ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడి అందరిని మెప్పించింది.ఇక తెలంగాణ ఉద్యమంలో కొన్ని పాటలు పాడి చాలా ఫేమస్ అయ్యింది.

అలాగే సినిమాల్లో కూడా కొన్ని పాటలు పాడే అవకాశాలు వచ్చాయి.అలా పాటలు పాడుతున్న తరుణంలో తన ఇంటి దగ్గరే ఉండే శ్రీకాంత్ ( Srikanth ) అనే వ్యక్తితో ఈమెకు పరిచయం ఏర్పడింది.

శ్రీకాంత్ బట్టల షాపులో సేల్స్ మెన్ గా పనిచేసేవాడు.అయితే ఇంట్లో వాళ్లకి ఈ విషయం తెలిసిన పట్టించుకోలేదట.

Telugu Divvorce, Folk, Madhupriyas, Madhupriya, Srikanth-Telugu Gossips

ఎందుకంటే మధుప్రియ ( Madhupriya ) సింగర్ కాబట్టి అందరూ ఆమెతో చనువుగా మాట్లాడతారు అని భావించారట.అయితే ఎలాగైనా సరే శ్రీకాంత్ ని పెళ్లి చేసుకోవాలని మధుప్రియ ఎన్నో ప్లాన్స్ వేసిందట.కానీ ఇంట్లో వాళ్లకి ఈ విషయం తెలియడంతో ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదట.కానీ వీరి పెళ్లి గురించి ప్రేమ గురించి మీడియాలో నానా రచ్చ చేసింది.

తల్లిదండ్రులు మా ప్రేమని అడ్డుకొని మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారని ఎన్నో ఘాటు వ్యాఖ్యలు చేసింది మధుప్రియ.ఇక వీరి ప్రేమ పెళ్లి గురించి మీడియాలో డిబేట్ లు పెట్టి మరి కొంతమంది సీనియర్లు గొడవలు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

కొంతమంది మధుప్రియ కి సపోర్ట్ చేస్తే మరి కొంతమంది తల్లిదండ్రులకు సపోర్ట్ చేశారు.

Telugu Divvorce, Folk, Madhupriyas, Madhupriya, Srikanth-Telugu Gossips

కానీ పెళ్లి అయినా ఆరు నెలలకే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చి మళ్లీ మీడియాలో తన పేరును వైరల్ చేసుకుంది మధుప్రియ.కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని చెప్పింది.అలా మధుప్రియ మీడియాలో వైరల్ అయ్యేసరికి తనకి సినిమాల్లో కూడా అవకాశాలు తగ్గాయి.

కానీ ఆ తర్వాత కొన్ని రోజులు భర్తతోనే ఉంది.కానీ స్టేజ్ షోలు ఇచ్చే టైంలో భర్తకి మధుప్రియ కి మధ్య గొడవలు రావడంతో మా ఫ్యామిలీ వాళ్లకు నువ్వు అలా స్టేజి పర్ఫామెన్స్ లు ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు.

నువ్వు అలా స్టేజ్ షోలు ఇవ్వడం మానేయ్ అని చెప్పారట.కానీ మధుప్రియ మాత్రం ఇది నా ఫ్యూచర్ ఇదే.నా ప్రొఫెషన్ ఇదే.దీన్ని నేను వదులుకోలేను అంటూ గట్టిగా చెప్పేసరికి ఇద్దరి మధ్య దూరం పెరిగి మధుప్రియ (Madhupriya)తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసింది.కానీ మధుప్రియ విడాకులు తీసుకున్న విషయం మీడియాలో వినిపించలేదు.అయితే సీక్రెట్ గా వీరిద్దరికి విడాకులు వచ్చాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube