మన దేశంలో చాలా మంది ప్రజలు ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పై( Health ) ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే కరోనా తర్వాత నుంచి మన జీవన శైలిలో చాలా రకాల మార్పులు వచ్చాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో చిన్న వాళ్ళ నుంచి పెద్దవారి వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఎందుకంటే ప్రస్తుత జీవన శైలిలో ఫాస్ట్ ఫుడ్, పాకెట్ ఫుడ్స్ లాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
అలాగే మనలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా టీ నీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.ప్రస్తుత రోజులలో కనీసం ప్రతి ఒక్కరు ఒక కప్పు టీ అయిన తాగకుండా అసలు ఉండలేకపోతున్నారు.అయితే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంతో, వయస్సును కనబడకుండా చేయడంలో ఈ బ్యూటీ అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ బ్లూ టీ ( Blue Tea ) తాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ బ్లూ టీ నీ శంకు పూలతో తయారు చేస్తారు.
ఈ పులలో బరువు తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి.కాబట్టి బరువు తగ్గించడంలో( weight Loss ) ఈ టీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అలాగే కొవ్వు ఎక్కువగా ఉన్నవారు దీన్ని రోజు తాగడం వల్ల కొవ్వు కూడా సులభంగా కరిగిపోతుంది.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉండడం ఎంతో ముఖ్యం.యాంటీ ఆక్సిడెంట్లు అనేక రకాలుగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే డిప్రెషన్, మానసిక ఒత్తిడి సమస్యలకు చెక్ పెడుతుందని కచ్చితంగా చెప్పొచ్చు.బ్లూ టీ లో ఉండే విటమిన్లు, ఖనిజాలు జుట్టు పెరుగుదలకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.