బీజేపీ( BJP ) ఈ మద్య తెలుగు రాష్ట్రాలపై గట్టిగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు ఉంటే.
వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ సత్తా చాటలని కాషాయ పార్టీ గట్టి పట్టుదలగా ఉంది.
ఏకపోతే ఎప్పటి నుంచో తెలుగు రాష్ట్రాలపై కన్నేసిన కమలం పార్టీ.అనుకున్న రీతిలో పుంజుకోవడం లేదు.
తెలంగాణలో అరకొర బలమైన నేతలు ఉండడం వల్ల ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రేస్ లో ఉన్నప్పటికి ఏపీలో( Andhra Pradesh ) మాత్రం అసలు కాషాయ పార్టీని ప్రధాన పార్టీగా అసలు కన్సిడర్ చేయడం లేదు.
దీంతో ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది అధిష్టానం.పార్టీని నత్త నడకన సాగించిన సోము వీర్రాజును పక్కన పెట్టి ఆయన స్థానంలో అధ్యక్ష బాద్యతలను పురందేశ్వరికి( Purandheswari ) అప్పటించింది.ఇక ఇప్పుడు మరో మార్పుకి బీజేపీ పెద్దలు సిద్దమౌతున్నట్లు టాక్ నడుస్తోంది.
ఏపీ బీజేపీ కో ఇంచార్జ్ సునిల్ డియోధర్ ను( Suneel Deodhar ) తప్పించే యోచనాలో కమలం పార్టీ అధిష్టానం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈయన పనితీరుపై పార్టీ నేతల్లోనే అసంతృపి ఉందట.
అలాగే డియోధర్ వ్యూహాలు కూడా పెద్దగా ఫలించడం లేదు దాంతో ఆయన స్థానంలో మరో నేతను ఎన్నుకోవాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందట.తెలంగాణ బీజేపీకి సారథ్య బాద్యతలు నిర్వహించి సక్సస్ అయిన బండి సంజయ్ ని ( Bandi Sanjay ) ఏపీ బీజేపీ కో ఇంచార్జ్ గా నియమిస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా కాషాయ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే తెలంగాణలో బీజేపీని బలపరచడంలో బండి సంజయ్ పాత్ర చాలానే ఉంది.అయితే అనూహ్యంగా ఆయనను ఇటీవల అధ్యక్ష పదవి నుంచి తప్పించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.ఇప్పుడు ఏపీ విషయంలో కూడా బండి సేవలను ఉపయోగించుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.ఏపీ బీజేపీ కో ఇంచార్జ్ గా బండి సంజయ్ ని నియనిస్తే ఆ పార్టీ మిత్రా పక్షం అయిన జనసేన అందుకు అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్థకమే.
ఎందుకంటే గతంలో జనసేన పొత్తు విషయంలో బండి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచిన సంగతి విధితమే.అందువల్ల బండి సంజయ్ ఏపీ బీజేపీలోకి వస్తే పవన్ వైఖరి ఎలా ఉండబోతుందనేది చూడాలి.
మొత్తానికి ఏపీలో బలపడేందుకు బీజేపీ వేస్తున్న ప్లాన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.