సూరత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ ఏర్పాటు.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..

భారతదేశంలోని “సూరత్ డైమండ్ బోర్స్”( Surat Diamond Bourse ) అనే ఆఫీసు కాంప్లెక్స్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని తనవైపే తిప్పుకుంటోంది.చాలా ప్రత్యేకమైన ఆఫీస్‌గా నిలవడమే అందుకు కారణం.

 Surat Diamond Bourse Becomes Worlds Largest Office Building,surat Diamond Bourse-TeluguStop.com

అంతేకాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీసు బిల్డింగ్‌గా అవతరించింది.ఈ భవనం పెంటగాన్ కంటే కూడా పెద్దది! దీని నిర్మాణానికి రూ.3,000 కోట్లు ఖర్చయ్యాయి.దీనిని మణిత్ రస్తోగి అనే ఆర్కిటెక్ట్ రూపొందించారు.

ఈ భవనం 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.మధ్యలో విశాలమైన కారిడార్‌తో లింక్ అయిన తొమ్మిది భవనాలతో ఈ ఆఫీసు నిర్మితమైంది.

ఒక్కో భవనంలో 15 అంతస్తులతో పాటు గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది.భవనం లోపల 4,500 ఆఫీసులు ఉన్నాయి.ఈ ఆఫీసుల్లో డైమండ్స్( Diamonds Office ) తయారు చేస్తారు.

వజ్రాల కట్టర్లు, పాలిషర్లు, వ్యాపారులు ఈ అద్భుతమైన ఆఫీసులకు వచ్చి పని చేసుకోవచ్చు.ఈ ఆఫీసులు 300 చదరపు అడుగుల నుంచి 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి.20 లక్షల చదరపు అడుగుల స్థలంతో అండర్‌గ్రౌండ్‌లో చాలా పెద్ద పార్కింగ్ ప్రాంతం కూడా ఉంది.

ఈ భవనాన్ని పర్యావరణానికి హాని చెయ్యని విధంగా నిర్మించారు.ఈ భవనం ఆకృతి దానిని చల్లబరుస్తుంది.లోపల మరింత చల్లగా ఉండటానికి సహాయపడుతుంది.భవనం లోపల సెక్యూరిటీ వాల్ట్‌లు, మీటింగ్ హాల్స్, రెస్టారెంట్లు, బ్యాంకులు వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.కరోనా మహమ్మారి( Covid Effect ) కారణంగా జరిగిన కొన్ని ఆలస్యాల వల్ల దీనిని నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది.2023, నవంబర్ 21న ఈ ఆఫీస్ ప్రారంభిస్తారు.ఈ భవనాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube