కొత్తగా టూవీలర్ లేదా ఫోర్ వీలర్ కొనేవారికి కేంద్రం ఓ సరికొత్త స్కీమ్ తీసుకువచ్చింది!

కొత్తగా టూవీలర్ లేదా ఫోర్ వీలర్ కొనేవారి కోసం ఈ వార్త.ఓ ఏకంగా ఇది శుభవార్త అనే చెప్పుకోవాలి.

 Central Government Brought A Brand New Scheme New Two Wheeler Or Four Wheeler Bu-TeluguStop.com

అవును, కేంద్ర ప్రభుత్వం( Central Govt ) కొత్త స్కీమ్ తీసుకువచ్చే పనిలో పడిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఫేమ్ 3 స్కీమ్‌పై మోదీ సర్కార్ పని చేస్తున్నట్లు కొన్ని తాజా నివేదికలు వెల్లడించాయి.

దీని వల్ల కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.ప్రస్తుతం ఫేమ్ 2 స్కీమ్ అందుబాటులో ఉండగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫేమ్ 3 స్కీమ్‌పై పని చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఫేమ్ 2 స్కీమ్ అందుబాటులో ఉంటుందని సమాచారం.ప్రస్తుతం ఫేమ్ 2 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వెహికల్స్( Electric Vehicles ) కొనుగోలుకు సబ్సిడీ లభిస్తోంది.

Telugu Central, Scheme, Wheeler, Vehicles, Subsidy-Latest News - Telugu

హైబ్రిడ్ వెహికల్స్ కొనుగోలుపై ఈ సబ్సిడీ పొందొచ్చు.ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ ట్రక్కులు వంటి వాహనాల కొనుగోలుపై సబ్సిడీ రూపంలో తగ్గింపు లభిస్తోంది.ఫేమ్ 1 స్కీమ్ కింద కూడా ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండేది.అయితే ఇప్పుడు ఫేమ్ 3 స్కీమ్‌లో( FAME 3 Scheme ) ప్రత్యామ్నాయ ఫ్యూయెల్ వెహికల్స్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ త్రివీలర్స్ వంటి వాటికి ఫేమ్ 3 స్కీమ్‌లో సబ్సిడీ ఎక్కువగా ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి.

Telugu Central, Scheme, Wheeler, Vehicles, Subsidy-Latest News - Telugu

ఫేమ్ 1, ఫేమ్ 2 స్కీమ్స్ కింద ఎలక్ట్రిక్ టూవీలర్లకు అధిక ప్రాధాన్యం లభించింది.ప్రారంభ దశలో కేంద్రం 40 శాతం వరకు సబ్సిడీ ఇచ్చేది.అయితే ఫేమ్ 2 స్కీమ్‌లో ఈ సబ్సిడీని 15 శాతం వరకు తగ్గించారు.

అయితే ఫేమ్ 1, 2 స్కీమ్స్‌లో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లకు( Electric Four Wheelers ) ఎక్కువ ప్రోత్సాహం లభించలేదని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.అందుకే ఇప్పుడు ఫేమ్ 3 స్కీమ్ కింద ప్రభుత్వం వీటికి అధిక ప్రోత్సాహం అందించే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు.

అందువల్ల కొత్త స్కీమ్ అందుబాటులోకి వస్తే.కారు కొనే వారికి ఎక్కువ లాభం చేకూరనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.అంతేకాకుండా టూవీలర్లకు కూడా సబ్సిడీ లభించొచ్చు.అయితే గతంలో కన్నా తక్కువ బెనిఫిట్ ఉండొచ్చు.

అందువల్ల మీరు ఎలక్ట్రిక్ టూవీలర్ కొనే ప్లానింగ్‌లో ఉంటే ఫేమ్ 2 స్కీమ్ ఉన్నప్పుడే కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube