అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అదుపులోనికి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు..

జిల్లా వ్యాప్తంగా గంజాయి మరియు మాదకద్రవ్యాల నేరస్తులపై కృష్ణాజిల్లా ( Krishna District )పోలీసుల ఉక్కు పాదంప్రవర్తన మార్చకుంటే PD యాక్ట్ తో చెక్ తప్పదు.ప్రజారోగ్యాలతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించిన జిల్లా ఎస్పీ శ్రీ పి జాషువా ఐపీఎస్ గారు.బంగారు భవిష్యత్ను చూడవలసిన యువతను వారి స్వలాభం కోసం సులభ సంపాదన మోజులో పడి గంజాయిని విక్రయిస్తూ వారిని మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుస్తున్న కరుడుగట్టిన గంజాయి స్మగ్లర్లను 10.07.2023 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీస్ స్టేష( Police Station )న్ల పరిధిలో దాడులు నిర్వహించి అందులో చిలకలపూడి, కృతీవెన్ను, గుడివాడ 1 వ పట్టణ, 2 వ పట్టణ, తాలూకా, గన్నవరం, ఉంగుటూరు, పెనమలూరు, కంకిపాడు, వీరవల్లి, వుయ్యూరు టౌన్, రూరల్ మరియు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని మొత్తం 45 కరుడు కట్టిన గంజాయి స్మగ్లర్లు & పెడ్లర్లు మరియు స్మోకర్స్ ను ఆధీనం లోకి తీసుకొని వారి వద్ద నుండి మొత్తం 51.600 కే‌జిల గంజాయి ను స్వాధీన పరచుకొని ఈ రోజు సదరు ముద్దాయిలకు సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీ పి జాషువా ఐపీఎస్ గారు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో గల సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించి కేసు పూర్వాపరాలు వెల్లడించారు.

 Krishna District Police Arrests Serious Inter-state Ganja Smugglers, Police Stat-TeluguStop.com

జిల్లా లో గంజా రవాణా మరియు అమ్మకం పై గట్టి నిఘా ఏర్పాటు చేసి నలుగురు కారుడు కట్టిన గంజా స్మగ్లర్ల పై( Ganja smugglers ) పీడీ యాక్ట్ ప్రయోగించి వారిని రాజమండ్రి సెంట్రల్ జైల్ కి పంపడం జరిగినది.గడిచిన 4 సంవత్సరాల కాలంలో 219 కేసులు నమోదు చేసి 616 మంది ముద్దాయిలను మంది అరెస్ట్ చేసి 203 మంది ముద్దాయిలపై షీట్లు ఓపెన్ చేయగా, అందులో కేవలం గత సంవత్సర కాలంలోనే 95 కేసులు నమోదు చేసి, 317 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 497.690 కే‌జిల గంజాయి ను స్వాధీనం చేసుకొని 78 మంది ముద్దాయిలపై షీట్లు ఓపెన్ చేయడం జరిగింది.గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారి మరియు రాష్ట్ర డీజీపీ శ్రీ కె.వి.రాజేంద్రనాధ్ రెడ్డి ( K.V.Rajendranath Reddy )ఐపీయస్ గారి ఆదేశాలమేరకు గంజాయి మరియు మాదక ద్రవ్యాల నివారణకు ప్రత్యేక బృంధాలతో తనిఖీలు ముమ్మరం చేసి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.అదేవిధంగా గంజాయి మొదలగు మాదక ద్రవ్యాలు వలన జరిగే పర్యవసానలపై స్కూల్స్, కాలేజీలు మరియు పబ్లిక్ ప్లేసులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.గంజా స్మగ్లర్ లు ఎక్కడ ఉన్న, ఎంతటి వారుఅయినా ఉపేక్షించేది లేదు.

గంజా ఉనికి గురించి తెలిసిన యెడల ఈ క్రింది వారికి సమాచారము చెరవేసిన అట్టి వారి వివరములు గోప్యముగా ఉంచబడును.

జిల్లా ఎస్పి – 9440796400 జిల్లా ఏఎస్పి – 9440796401

నోట్ – తమ యొక్క పిల్లల నడవడిక పై పాకెట్ మనీ కరచు పై, వారి స్నేహితుల పై తల్లి తండ్రులు ఎల్లవేళలా నిఘా ఉంచి వారు పెడత్రోవ పట్టకుండా తగు జాగ్రత్త వహించవలసిందిగా తల్లి తండ్రులను కోరడమైనది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube