ఒక్కొ దేశంలో ఒక్కొ రకంగా ఉద్యోగుల జీతాలు ఉంటాయి.ప్రభుత్వ ఉద్యోగం చేసేవారితో పాటు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేసేవారికి కూడా దేశాన్ని బట్టి శాలరీలు ఒక్కొలా ఉంటాయి.
కొన్ని దేశాల్లో జీతాలు బాగా ఎక్కువగా ఉంటే.మరికొన్ని దేశాల్లో చాలా తక్కువగా ఉంటాయి.
దీంతో జీతాలు బాగా ఎక్కువగా ఉండే దేశాలకు ఇతర దేశాల ప్రజలు వెళ్లి అక్కడ డబ్బులు సంపాదించుకుంటారు.కొంతమంది అక్కడే స్థిరపడితే.
మరికొందరు డబ్బులు సంపాదించుకున్న తర్వాత తిరిగి స్వదేశానికి వెళతారు.
అయితే ప్రపంచంలోనే అత్యధిక జీతాలు ఇచ్చే దేశాలు కొన్ని ఉన్నాయి.స్విట్జర్లాండ్( Switzerland ) లో జీతాలు బాగా ఎక్కువగా ఉంటాయి.సగటున ప్రతి ఒక ఉద్యోగికి ప్రతినెలా రూ.5 లక్షల వరకు జీతం వస్తుంది.జీతాలు అధికంగా ఉండటమే కాకుండా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా స్విట్జర్లాండ్ కు పేరుంది.ఇక ఐరోపాలో ఒక చిన్న దేశమైన లక్సెంబర్గ్( Luxembourg ) లో ఒక ఉద్యోగికి సగటున రూ.48 లక్షల వార్షిక వేతనం ఉంది.అక్కడ కూలి పనులు, డ్రైవర్లుగా పనిచేసేవారు కూడా లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు.
ఇక అధిక జీతాలు ఇచ్చే దేశాల్లో సింగపూర్( Singapore ) తొలి స్థానంలో ఉంది.ఇక్కడ సగటున ఒక్కో ఉద్యోగికి రూ.5 లక్షల వేతనం నెలకు ఇస్తున్నారు.నివసించడానికి అత్యంత బెస్ట్ ప్లేస్ గా సింగపూర్ ఉంది.ఇక అమెరికాలో( America ) ఏడాదికి సగటున ఒక ఉద్యోగికి రూ.34 లక్షల జీతం ఉంది.ఇక లారీ, ట్రక్కు డ్రైవర్లకు కూడా అక్కడ లక్షల్లో జీతం ఉంటుంది.ఇక ఐస్లాండ్( Iceland ) లో ఒక ఉద్యోగికి సగటున నెలకు రూ.3 లక్షల వరకు జీతం ఉంది.అలాగే డెన్మార్క్ దేశంలో కూడా ఏడాదికి సగటున ఒక ఉద్యోగికి రూ.38 లక్షల జీతం ఇస్తున్నారు.