నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఇన్ ఛార్జ్ లను ప్రకటించిన బీజేపీ..!!

దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ( BJP ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.

 Bjp Announced Four State Election In Charges Details, Bjp, Election In Charges,-TeluguStop.com

మే నెలలో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘోరంగా ఓటమి చెందడం జరిగింది.అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ( Congress ) మళ్లీ పుంజుకోవటం జరిగింది.

ఈ పరిణామంతో వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుని తాజాగా ఇన్ ఛార్జ్ లను ప్రకటించడం జరిగింది.ముందుగా తెలంగాణ ఇన్ ఛార్జ్ గా ప్రకాష్ జగదేకర్ నీ( Prakash Javadekar ) నియమించారు.

ఇదే సమయంలో సహ ఇన్ ఛార్జ్ గా.సునీల్ బన్సల్ నీ నియమించారు.రాజస్థాన్ బీజేపీ ఇన్ ఛార్జ్ గా ప్రహ్లాద్ జోషిని( Prahlad Joshi ) నియమించారు.చత్తీస్ గడ్ ఇన్ ఛార్జ్ గా ఓం ప్రకాష్ మాథుర్ నీ ఎంపిక చేయటం జరిగింది.ఇక మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్ గా భూపేంద్ర యాదవ్ నీ నియమించారు.2014లో ప్రకాష్ జగదేకర్ ఇన్ ఛార్జ్ గా ఉన్న సమయంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేశారు.కాగా ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ కావడం పట్ల తెలంగాణ బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube