తెలుగు ప్రేక్షకులకు అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) భార్య, నటి అమల( Amala ) గురించి మనందరికీ తెలిసిందే.కేవలం అక్కినేని ఇంటికి కోడలిగా మాత్రమే కాకుండా నటిగా కూడా అమల మనందరికీ సుపరిచితమే.
ఈ మె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు మూడు దశాబ్దాల కాలం అయిన విషయం తెలిసిందే.కెరియర్ ఆరంభంలోనే కమలహాసన్ రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.
ప్రస్తుతం హీరోలకు హీరోయిన్ లకు తల్లి పాత్రలలో నటిస్తోంది.ఇకపోతే అమల జంతు ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే.
కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.1991లో నేను హీరోయిన్‌గా నటించిన ఒక సినిమా విడుదల అయినా తరువాత కొంతమంది అమ్మాయిలు ఇంటి నుంచి పారిపోయి తన వద్దకు వచ్చేశారని ఆమె చెప్పారు.మలయాళం చిత్ర పరిశ్రమ అనగానే నాకు బాగా గుర్తుకు వచ్చేది Ente Sooryaputhrikku 1991లో ఈ సినిమా విడుదలైంది.
ఇందులో నా పాత్ర రెబల్‌గా ఉంటుంది.ఆ సినిమా రిలీజ్ అయ్యాక కేరళకు( Kerala ) చెందిన పలువురు అమ్మాయిలు తమ ఇళ్ల నుంచి పారిపోయి చెన్నైలోని( Chennai ) మా ఇంటికి వచ్చారు.
నా రోల్ తమకెంతో నచ్చిందని, తమలో స్ఫూర్తి నింపిందని వారు తెలిపారు అని చెప్పుకొచ్చింది అమల.
అలా, మొదటిసారి స్టార్‌డమ్ చూశాను.నా పాత్ర వాళ్లను ఏవిధంగా ప్రేరేపితం చేసిందో తెలుసుకుని సంతోషించాను.వాళ్లతో మాట్లాడి.
తిరిగి వాళ్లను క్షేమంగా ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పాను.నా మేనేజర్‌ను వాళ్లకు తోడుగా పంపించాను అని చెప్పుకొచ్చింది అమల.ఇకపోతే అమల తెలుగులో ఇటీవల శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల పలకరించిన విషయం తెలిసిందే.