తెలంగాణలో ( Telangana )ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలను సిద్దం చేసుకుంటూ ఎన్నికల వేడి పెంచుతున్నాయి.
ముఖ్యంగా ఈసారి తెలంగాణలో సత్తా చాటడం బీజేపీకి అనివార్యం అయింది.ఎందుకంటే సౌత్ రాష్ట్రాలలో ప్రస్తుతం బీజేపీ( BJP ) ఏ ఒక్క రాష్ట్రంలోనూ అధికారంలో లేదు.
నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న కర్నాటక కూడా చేజారిపోయింది.దాంతో ఇప్పుడు కమలం పార్టీ ఆశాలన్నీ తెలంగాణపైనే ఉన్నాయి.
అందువల్ల ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) బీజేపీకి డూ ఆర్ డై లాంటివనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ వేస్తున్న ప్రతి అడుగు కూడా పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది.ఇటీవల మహాజన్ సంపర్క అభియాన్( Mahajan Samparka Abhiyan ) పేరుతో గడప గడపకు తిరుగుతూ పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు రాష్ట్ర కమలనాథులు.ఈ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదేళ్ల మోడి పాలనలో జరిగిన మంచిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
అంతే కాకుండా డబుల్ ఇంజన్ సర్కార్ నినాదాన్నే ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నారు బీజేపీ నేతలు.ఇదిలా ఉంచితే జూలై 8 న 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు( BJP presidents ) మరియు సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో హైదరబాద్ లో ఓ భారీ సమావేశాన్ని నిర్వహించనుంది తెలంగాణ బీజేపీ.
ఈ సమావేశం ద్వారా రాష్ట్రంలో బీజేపీపై సానుకూలత ఏర్పడుతుందని కమలనాథులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అందుకే రాష్ట్రంలో జరిగే ఏ బీజేపీ కార్యక్రమం అయిన జాతీయ నాయకులు ఉండేలా చూసుకుంటున్నారు.ఇక జూలై 8 న జరిగే సమావేశానికి ప్రధాని మోడి వచ్చే అవకాశం ఉందని పోలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.ఇప్పటికే పలుమార్లు తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడి( Prime Minister Modi ) కేసిఆర్ హాట్ హాట్ కామెంట్స్ తో రాజకీయ వేడి పెంచారు.
ఇప్పుడు మరోసారి తెలంగాణకు వస్తే రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కే అవకాశం ఉంది.మొత్తానికి ఏ కార్యక్రమం అయిన ఏ సమావేశం అయిన అందరి దృష్టిని ఆకర్షించేలా బీజేపీ వేస్తున్న ప్లాన్స్ ఎంతవరకు సక్సస్ అవుతాయో చూడాలి.