యాదాద్రి భువనగిరి జిల్లా: దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తున్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) జిల్లా కార్యదర్శి బేజాడి కుమార్ అన్నారు.బుధవార జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పివైఎల్ 8వ జిల్లా మహాసభల కరపత్రం ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ 30న భువనగిరిలో బాబు జగ్జీవన్ రామ్ భవనంలో జరుగు పివైఎల్ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నప్పటికీ కనీసం పూర్తిస్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసే పరిస్థితిలో ఈ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లేవన్నారు.
ఉద్యోగాల నోటిఫికేషన్ల పేరుతోటి కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ కనీసం ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి కూడా నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితిలోకి ఈ దేశం నెట్టబడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరవీరుల త్యాగంతో ఎంతో కొట్లాడి సాధించుకున్న బంగారు తెలంగాణలో ఉద్యోగాలు మొత్తం కూడా అప్లై అప్లై నో రిప్లైగా మారిపోయాయని విమర్శించారు.
తెలంగాణ వస్తే బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందన్న యువకుల ఆశలపై నీళ్లు చల్లారని,తెలంగాణ వచ్చాక యువకులను ప్రశ్నించే తత్వం నుండి మద్యం వైపుకు మళ్లించారని,గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు పెట్టించి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తూ తాగుడికి బానిసలుగా చేసి యువకుల్ని,విద్యార్థుల్ని ప్రశ్నించే తత్వం నుంచి దూరం చేస్తున్నారన్నారు.ర్యాగింగ్,ఈవ్ టీజింగ్ పేరుతో 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అర్థరాత్రి పూట ఆడపిల్ల బయటికి వెళ్లే పరిస్థితి లేకపోగా పగటిపూట కూడా బయటికి వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి లేదన్నారు.
ఈ తరుణంలోనే ప్రగశీల యువజన సంఘం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని,ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయాలని,ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని సామ్రాజ్యవాద విష సంస్కృతిలో పడి విద్యార్థి,యువత నష్టపోవద్దని సూచించారు.ఈ సమస్యలను పరిష్కరించే దశలో ఈ జులై 4,5 తేదీలలో రాష్ట్ర మహాసభలను ఇల్లెందు పట్టణంలో పగడాల వెంకన్న నగర్ లో నిర్వహించబోతుందని, అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా అధ్యక్షులు సాదుల శ్రీకాంత్,జిల్లా సహాయ కార్యదర్శి చిరబోయిన బాలకృష్ణ,జిల్లా నాయకులు శకిలం వెంకటేష్,బడికే ఉదయ్, మహంకాళి నరసింహులు, బాలరాజు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.