అఫిషియల్ : బ్రో టీజర్ డబ్బింగ్ పూర్తి చేసిన పవన్.. ఇక రిలీజ్ కు ఆల్ సెట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో”( Bro ).ఈ సినిమా షూట్ అయితే పవన్ ఎప్పుడో పూర్తి చేసాడు కానీ కొద్దీ కొద్దీ పనులు పెండింగ్ లో ఉన్నాయి.ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు.వారాహి యాత్ర చేస్తూ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టేస్తున్నారు.

 Pawan Kalyan Completes Dubbing For Bro Teaser, Vinodhaya Sitham, Pawan Kalyan, S-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈయన నటించిన బ్రో సినిమా టీజర్ ను రిలీజ్ చేయాల్సిన సమయం ఆసన్నం అయ్యింది.అయితే ఈయన టీజర్ కు డబ్బింగ్ పూర్తి చేయలేక పోయాడు.అందుకే డైరెక్టర్ సముద్రఖని( Director Samuthirakhani ) మొబైల్ డబ్బింగ్ యూనిట్ ను తీసుకుని స్వయంగా పవన్ కళ్యాణ్ ఉన్న చోటుకు వెళ్లి ఆయనతో టీజర్ కోసం డబ్బింగ్ చెప్పించినట్టు తెలుస్తుంది.

మరి టీజర్ లో బ్యాలెన్స్ పవన్ పూర్తి చేసినట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

పవన్ కళ్యాణ్ డబ్బింగ్( Pawan Kalyan Dubbing ) చెబుతుంటే సముద్రఖని పక్కనే ఉండి వీక్షిస్తున్న పిక్ ఒకటి షేర్ చేస్తూ ఈ విషయాన్నీ మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఈ డబ్బింగ్ కోసం టీమ్ భీమవరం చేరుకొని అక్కడే పూర్తి చేసారని తెలుస్తుంది.

మరి అతి త్వరలోనే ఈ టీజర్ రిలీజ్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్.

ఈ టీజర్ నిముషం కంటే ఎక్కువ నిడివితో ఉంటుందని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.ఇక ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube