దేశ వ్యాప్తంగా కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి.అకాల వర్షాల కారణంతో పాటు స్థానికంగా పంటలు లేకపోవడంతో కూరగాయాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఏపీతో పాటు తెలంగాణలోనూ టమాట, పచ్చి మిర్చికి మార్కెట్ లో డిమాండ్ పెరిగింది.దేశ వ్యాప్తంగా పలు మార్కెట్ లలో కేజీ టమాట ధర రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది.మదనపల్లిలో టమాట రూ.80 ఉండగా కరీంనగర్ లో రూ.100 ఉంది.అటు హైదరాబాద్ నగరంలో కిలో పచ్చిమిర్చి రూ.120 వరకు పలుకుతోంది.అయితే ధరలు ఈ విధంగా పెరుగుతుండటంతో సామాన్యులు కూరగాయాలు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి.