టాలీవుడ్( Tollywood ) లో మరోసారి డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది కేపీ( KP ) గా పిలవబడే నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి డ్రగ్స్ కేసులో తాజాగా సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.ఈ కేసులో సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో కంటెస్టెంట్ అషురెడ్డితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థల యజమానులకు కేపీ చౌదరి డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.గత వారం గోవా నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను సరఫరా చేసి విక్రయించే క్రమంలో మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీం , రాజేంద్రనగర్ పోలీసులు కేపీని అరెస్ట్ చేశారు .అయన సెల్‌ఫోన్‌లను స్వాదీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్ చాటింగ్స్, ఫొటోలు, బ్యాంకు( WhatsApp chats, photos, bank ) లావాదేవీలను విశ్లేషించారు.ఆయా అంశాలపై స్పష్టత కోసం రెండురోజులు కస్టడీలోకి తీసుకొని విచారించారు.
అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు.రిమాండ్ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలను పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే పలు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి .
నటి సురేఖ వాణి( Actress Surekha Vani ) కుమార్తె సుప్రీత.కెపి చౌదరితో( KP Chaudhary ) సన్నిహితంగా ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఒక ఫొటోలో సుప్రీతా.
కేపీ చౌదరితో క్లోజ్ గా ఉండగా.మరో పిక్ లో అతడికి ముద్దు పెట్టేస్తోంది.
దీనితో సుప్రీతా( Supreeta ), సురేఖ వాణి ఇద్దరికీ డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు ప్రచారం మొదలయింది.సురేఖ వాణి.
కేపీ తో ఉన్న ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి.మరోవైపు అషురెడ్డి పేరు కూడా వినిపించగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ రూమర్స్ ని ఖండించింది.
అయితే ఫోటోలు దిగినంత మాత్రమే డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లు కాదని మరికొందరు వాదిస్తున్నారు.ఏది ఏమైనా పోలీస్ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
ఇక టివి, సినీ, వ్యాపార రంగాలకు చెందిన 12 సెలెబ్రిటీలతో కేపీ చౌదరి ఫోన్ సంభాషణ జరిపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి.అలాగే గూగుల్ డ్రైవ్ ఆధారంగా కూడా పోలీసులు కీలక విషయాలు వెలుగులోకి తీసుకువస్తున్నారు.కెపి చౌదరి బెంగుళూరు, గోవా కేంద్రంగా కొకైన్ విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.వీకండ్ పార్టీలలో కెపి చౌదరి సెలెబ్రిటీలని టార్గెట్ చేసి వారికి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు అషురెడ్డి( Ashureddy ), సినీనటి జ్యోతి, అలాగే పంజాగుట్టకి చెందిన ప్రముఖ క్యాబ్స్ ఓనర్ లతో కేపీ చౌదరి ఎక్కువసార్లు ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది.ఇక ఈ కేసు విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూడవచ్చని .పలువురు ప్రముఖుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి మరి ముందు ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది ఆసక్తి రేపుతోంది…
.