రామ్ చరణ్ కి స్పెషల్ క్లాస్ తీసుకున్న చిరంజీవి...

మెగా ఇంటికి మహాలక్ష్మి వచ్చేసింది…ఉపాసనకు( upasana ) పుట్టేది అమ్మాయే అంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది.అనుకున్నట్లే ఉపాసనకు ఆడబిడ్డ పుట్టింది.

 Chiranjeevi Took Special Class To Ram Charan, Ram Charan, Upasana, Brahmini, Tol-TeluguStop.com

ఇక ఉపాసన డెలివరీకి ఓ నెల ముందు నుంచి రామ్ చరణ్( Ram Charan ) తన సినిమా షూటింగ్స్’కు బ్రేక్ ఇచ్చారు.ఈ కీలక సమయంలో ఉపాసన పక్కనే రామ్ చరణ్ ఉన్నారు.

అంతేకాదు డెలివరీ తర్వాత కూడా కొన్ని నెలల పాటు రామ్ చరణ్ ఇంట్లోనే తన భార్య ఉపాసనకు సాయంగా ఉండాలని అలాగే ఉంటున్నరాన్న విషయం మనకు తెలిసిందే….ఇక పాప రాకతో మెగా ఇంట సంబురాలు కేకపుట్టిస్తున్నయి.

 Chiranjeevi Took Special Class To Ram Charan, Ram Charan, Upasana, Brahmini, Tol-TeluguStop.com

చరణ్ చరిష్మా కూడా మారిపోతుంది అంటున్నారు…నిన్న హాస్పిటల్ నుంచి ఫస్ట్ టీమ్ రామ్ చరణ్ తన బిడ్డ ని ఎత్తుకొని కనిపించారు అలాగే ఉపాసన కూడా కనిపించింది.

Telugu Brahmini, Ram Charan, Tollywood, Upasana-Movie

అయితే పెళ్లైన 11 ఏళ్ల తర్వాత చరణ్ తండ్రి కావడంతో తమ కొణిదెల కుటుంబంలోకి మహాలక్ష్మీ వచ్చిందంటూ చిరంజీవి తెగ సంబరపడిపోతున్నారు.అంతేకాదు పాప రాకతో తమ కుటుంబానికి అన్ని కలసి వస్తున్నాయని కూడా చిరు చెప్పారు .ఇదే సమయంలో కొందరు జ్యోతిష్యులతో పాటు మెగా అభిమానులు కూడా రామ్ చరణ్ జాతకం మారబోతుందని అంటున్నారు.పాప కడుపులో పడ్డప్పటి నుంచి అంతా మంచే జరుగుతుందని అనుకుంటున్నారు.చరణ్ మాదిరిగానే తొలి సంతానంగా కుమార్తెకు జన్మనిచ్చిన స్టార్స్ కొందరు ఆ తర్వాత తమ కెరీర్ లో మరింత ఉన్నతంగా ఎదిగారు .చిరంజీవికి మొదటి సంతానంగా సుస్మిత జన్మించింది.ఆ తర్వాత ఆయన మెగాస్టార్ గా మారిపోయారు.

బాలకృష్ణకు బ్రాహ్మణి( Brahmini ) మొదటి సంతానం.అప్పట్లో బాలయ్య వరుస విజయాలు అందుకున్నారు .వెంకటేష్ కు ఆశ్రిత, మోహన్ బాబుకు లక్ష్మీ ప్రసన్న పుట్టిన తర్వాత కలసి వచ్చింది , అమితాబ్ బచ్చన్ కు శ్వేత బచ్చన్.రజినీ కాంత్ కు ఐశ్యర్య పుట్టాక వారు ఇంకా ఎక్కువ పేరు తెచ్చుకున్నారు , అలాగే కమల్ హాసన్ కు శృతి హాసన్, సైఫ్ అలీ ఖాన్, రణ్‌బీర్ కపూర్ వంటి వారికీ స్టార్లందరికీ మొదటి సంతానంగా ఆడపిల్లలే పుట్టారు.

ఆడపిల్ల రాకతో వీళ్లు స్టార్లుగా మారిపోయారు.దీనితో చరణ్ కూడా మరింత ఎదుగుతారని అంటున్నారు.ఇప్పటికే ఆ పరిణామాలు కనిపిస్తున్నాయని .చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడని .మరింత ఎదగడం ఖాయమని పేర్కొంటున్నారు.

Telugu Brahmini, Ram Charan, Tollywood, Upasana-Movie

రామ్ చరణ్ ఇప్పుడు తండ్రిగా ఒక పెద్ద బాధ్యత మోయాబోతున్నాడు ఇక ఈ విషయం మీద చిరంజీవి రామ్ చరణ్ కి చాలా సలహాలు సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ఏంటంటే పిల్లల్ని తండ్రి గా ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా పెంచాలి, మనం ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేయాలి అనే విషయం మీద చిరంజీవి, రామ్ చరణ్ కి వివరించి చెప్పినట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube