అలీ ( Ali) అంటేనే కామెడీ కింగ్ అని చెప్పాలి.బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలీ అనంతరం కమెడియన్ గా ఎన్నో వందల సినిమాలలో నటించి స్టార్ కమెడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇప్పటికీ ఈయన కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అలాగే బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అలీ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈటీవీలో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇప్పటికే ఆలీ ఈటీవీలో వ్యాఖ్యాతగా అలీ 369, ఆలీతో జాలీగా,ఆలీతో సరదాగా అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఇక ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా ఎంతో మంచి ఆదరణ లభించింది.లేకపోతే తాజాగా మరొక కార్యక్రమం ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆటపాటలతో పాటు, క్విజ్ టాక్ షోలను మిక్స్ చేస్తూ ఈ కార్యక్రమం అలీ ఆల్ ఇన్ వన్ ( Ali All In One ) అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి 9:30 లకు ప్రసారం కాబోతోంది.
ఇక ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ లో భాగంగా బుల్లితెర కమెడియన్ అవినాష్( Avinash ), సిరి( Siri ) బుల్లితెర నటుడు అమర్ దీప్( Amar Deep ) పాల్గొనబోతున్నారు.ఇక ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రసారం అవుతున్న సందర్భంగా నటుడు అలీ మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.ఈటీవీతో తనకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదని తెలిపారు.ఈటీవీలో నేను చేసిన ప్రతి ఒక్క షో ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరించారు.ఇప్పుడు సరికొత్త షో ద్వారా వెరైటీ వినోదాలను పంచడానికి మీ ముందుకు వస్తున్నానంటూ తెలియజేశారు.ఇక ఈ కార్యక్రమాన్ని జ్ఞాపిక ప్రొడక్షన్స్ సమర్పిస్తున్నారు.