ఇంటిని ఏ విధంగా అయితే వాస్తు ప్రకారం నిర్మించుకుంటామో అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువులు విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి.అంతేకాకుండా కొన్ని సందర్భాలలో మొక్కలు, పువ్వులు కూడా ఇంటి వాస్తును నిర్ణయిస్తాయి.
ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి మంచి చేసే పువ్వులలో గులాబీ పువ్వులు ఎంతో ముఖ్యమైనవి.ఇంట్లో గులాబీ మొక్క ఉంటే వాస్తుకు సంబంధించిన ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి.
అలాగే ఇంట్లో సానుకూల శక్తి కూడా పెరుగుతుంది.గులాబీ మొక్క ప్రేమకు చిహ్నంగా భావిస్తారు.
గులాబీ( Rose flowers )భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ రహిత్యాన్ని తగ్గించి వారి మధ్య ప్రేమానుబంధం మరింత పెంచుతుంది.ఇక వాస్తు శాస్త్రం గులాబీకి సంబంధించిన కొన్ని చిట్కాలు పాటించడం వలన జీవితంలో అనేక సమస్యల నుండి బయటపడవచ్చు.
కుటుంబంలోని వ్యక్తులు ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది.లక్ష్మీదేవి ఆశీస్సులు, కుటుంబ సభ్యులపై ఉంటుంది.
దీంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
ఇక పెళ్లయిన వారికి వారి దాంపత్య జీవితంలో ఏదైనా ఇబ్బంది ఎదురవుతూ ఉంటే పడకగదిలో ఒక గ్లాసులో నీటిని పోసి కొన్ని గులాబీ రేకులతో ఆ పాత్రను నింపేయాలి.ఇక గులాబీ రేకులు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండేలా చూసుకోవాలి.ఇలా చేస్తే ఇబ్బందులు తొలిగిపోతాయి.
దీంతో భార్యాభర్తల మధ్య ప్రేమరాహిత్యం తగ్గి ప్రేమ బంధం బలపడుతుంది.గులాబీ మొక్కలు పెట్టడం వలన ఆ వ్యక్తికి సమాజంలో గౌరవం బాగా పెరుగుతుంది.
సమాజంలో వారికి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా చాలామంది జీవితంలో ఏదో సమయంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటారు.అలాంటి వారికి గులాబీ చాలా మేలు చేస్తుంది.జీవితంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా శుక్రవారం రోజున దుర్గాదేవి( Durgadevi )కి ఐదు గులాబీ రేకులను తమలపాకులో పెట్టి సమర్పించాలి.
ప్రతిరోజు సంధ్య వేళలో లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించాలి.ఇలా చేస్తే లక్ష్మీదేవి( Goddess Lakshmi ) సంతోషిస్తుంది.దీంతో మీ జీవితంలో ఉండే అన్ని డబ్బు సమస్యలు తొలగిపోతాయి.
DEVOTIONAL