ఆదాశర్మ(Adah Sharma) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు పూరి జగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో నితిన్(Nithin) హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్(Heart Attack) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం పలు తెలుగు సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ వచ్చారు.ఇలా ఇండస్ట్రీలో దాదాపు దశాబ్దన్నర కాలం పాటు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నటువంటి ఈమెకు ఇ ది కేరళ స్టోరీ(The Kerala Story) సినిమా మాత్రం తనని ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది.
ఇలా ది కేరళ స్టోరీ సినిమా ద్వారా ఈమె సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.అయితే తాజాగా ఈమెకు సోషల్ మీడియా నుంచి భారీ స్థాయిలో వేధింపులు మొదలయ్యాయని తెలుస్తోంది.కేవలం తన ఫోన్ నెంబర్ లీక్ (Mobile Number Leak) అవడంతో పెద్ద ఎత్తున ఈమెకు సోషల్ మీడియా నుంచి వేధింపులు వస్తున్నాయని తెలుస్తోంది.
నటి ఆదాశర్మ వ్యక్తిగత విషయాలతో పాటు ఫోన్ నెంబర్ కూడా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో లీక్ చేశారు.ఇందుకు సంబంధించిన jhamunda_bolte అనే ఇన్స్టాగ్రామ్ యూజర్‌ను డీయాక్టివేట్ చేయగా.తనే ఆదా శర్మ కొత్త కాంటాక్ట్ నంబర్‌ను కూడా లీక్ చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది.ఇలా తన ఫోన్ నెంబర్ ఇతర వ్యక్తిగత విషయాలు లీక్ అవ్వడంతోనే తనుకు వేధింపులు మొదలయ్యాయని తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.