ఇంతకి మహేష్‌ - రాజమౌళి సినిమా నిర్మాత ఎవరు?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి( Rajamouli ) సినిమా అంటే మినిమం వెయ్యి కోట్లు అన్నట్లుగా పరిస్థితి మారింది.బాహుబలి 2 ( Baahubali 2 )సినిమా రూ.1800 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే.ఆర్‌ఆర్ఆర్ సినిమా దాదాపుగా రూ.1200 కోట్లకు పైగా రాబట్టిన విషయం తెల్సిందే.ఇక ప్రస్తుతం మహేష్ బాబు తో రాజమౌళి సినిమాకు రెడీ అవుతున్నాడు.

 Producer Of Mahesh Babu And Rajamouli Movie , Rajamouli Movie , Mahesh Babu, Fl-TeluguStop.com

ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబో మూవీ యొక్క బడ్జెట్‌ ఎంత అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరో వైపు ఈ సినిమా ను ఎవరు నిర్మించబోతున్నారు అనే విషయంలో కూడా కొందరికి అనుమానాలు ఉన్నాయి.

చాలా సంవత్సరాల క్రితం నిర్మాత కేఎల్‌ నారాయణ ఇచ్చిన అడ్వాన్స్ లను రాజమౌళి మరియు మహేష్ బాబు( Mahesh Babu ) తీసుకున్నారు.ఏవో కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.

కొందరు హీరోలు.దర్శకులు నిర్మాత అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేస్తారు.

కానీ రాజమౌళి మరియు మహేష్‌ బాబు మాత్రం ఆయనతో సినిమాను చేసేందుకు ఓకే చెప్పి అదే మాటపై ఉన్నారు.కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తున్నా కూడా కచ్చితంగా చేస్తాం అంటూ హామీ ఇస్తూ వచ్చారు.

Telugu Kl Yana, Mahesh Babu, Rajamouli, Telugu-Movie

ఎట్టకేలకు ఆ సమయం వచ్చింది.రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా సినిమా అంటే ఉన్న అంచనాల నేపథ్యంలో మినిమంగా రూ.500 కోట్ల బడ్జెట్‌ అయినా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.ఆ స్థాయి లో కేఎల్‌ నారాయణ ఖర్చు చేస్తారా అంటే కచ్చితంగా అనుమానమే.

అయితే ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా మరెవ్వరైనా చేరే అవకాశాలు ఉన్నాయి.మహేష్ బాబు మరియు రాజమౌళి ముందస్తు పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటాను తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇక మేకింగ్ కు కనీసం రెండు వందల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది.ఆ మొత్తంను నిర్మాత పెట్టాల్సి ఉంటుంది.

దాన్ని కూడా ఫైనాన్స్ తీసుకు వచ్చి కేఎల్‌ నారాయణ( KL Narayana ) పెట్టవచ్చు.కనుక రాజమౌళి సినిమా కు నిర్మాత సమస్య కానే కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube