మావి పచ్చని పంటలు వారివి మతం మంటలు:కేటీఆర్ హాట్ కామెంట్

2014లో ఇచ్చిన హామీలు కూడా ఇంకా అమలు చేయకుండా భాజాపా ప్రభుత్వం మతవిద్వేషాలు రెచ్చగొట్టడంతోనే అధికారంలోకి రావాలని చూస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బారసా జాతీయ కార్యదర్శి కే.టి.రామారావు (K.T.Rama Rao ).తెలంగాణలోకి ఇప్పుడిప్పుడే నీళ్లు ప్రవహిస్తున్నాయని కాంగ్రెస్ భాజాపాలకు మరొక అవకాశం ఇస్తే రక్తం ప్రవహిస్తుందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు .పచ్చని పంటలు కావాలో మతం మంటలు కావాలో మీరే నిర్ణయించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

 Ktr Hot Comments On Congress And Bjp , Ktr , Brs , Kcr , Bjp, Ts Politics, Naren-TeluguStop.com
Telugu Bandi Sanjay, Congress, Narendra Modi, Ts-Telugu Political News

మెహబూబ్ నగర్ జిల్లాలో దివిటిపల్లిలో 40 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభించిన ఆయన జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భాజపా కాంగ్రెస్పై అనేక విమర్శలు చేశారు.కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ముఖ్యమంత్రి పై కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారని 55 ఏళ్లు పరిపాలన చేసి దేశాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్కు మరొక అవకాశం ఇవ్వమని ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కోరటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Telugu Bandi Sanjay, Congress, Narendra Modi, Ts-Telugu Political News

అస్తవ్యస్తమైన మీ విధానాల వళ్ళే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈ గతి పట్టిందని ఆయన దుయ్యపట్టారు .ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రేషన్ అని ఇప్పుడు ఇరిగేషన్ గా మార్చిన గనత కెసిఆర్ దే అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు దాదాపు పూర్తయ్యాయని, ఆగస్టు నుంచి నీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు .

Telugu Bandi Sanjay, Congress, Narendra Modi, Ts-Telugu Political News

భాజపా హయాములో రైతు ఆదాయం పెరగలేదు కానీ మోడి మిత్రుడు( Narendra Modi ) అదానీ ఆదాయం మాత్రం కొన్ని వందల రెట్లు పెరిగిందని, ఒకపక్క శాంతిభద్రతల కాపాడుతామంటూనే మరొక పక్క మతవిద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు పెట్టడం భాజపాకు అలవాటని, అభివృద్ధి గురించి బాజాపా పట్టించుకోదని అది వారికి అనవసరమని అధికారం మాత్రమే కావాలని ఆయన వాఖ్యనించారు .మరి కేటీఆర్ వ్యాఖ్యలపై కమలదళం ప్రతిస్పందన ఏమిటో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube