గరుడ పురాణాన్ని( Garuda Purana ) వైష్ణవ శాఖ పవిత్ర గ్రంథం అని చెబుతూ ఉంటారు.ఈ గ్రంథం ఒక వ్యక్తి పుట్టుక, మరణం, స్వర్గం, నరకం గురించి చెబుతుంది.
దీనితో పాటు ఒక వ్యక్తి చర్యలు కూడా ఇందులో వివరంగా ప్రస్తావించారు.అంతేకాకుండా ఒక వ్యక్తి పునర్జన్మ గురించి కూడా ఇది వెల్లడిస్తుంది.
మరణం తర్వాత ఆత్మ ఎలా ఏ రూపంలో పుడుతుందో గరుడ పురాణంలో వెల్లడించారు.ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన కర్మల ఆధారంగా మరణం తర్వాత జన్మరూపం నిర్ణయం జరుగుతుంది.
అంటే ఈ జన్మలో కర్మల ఆధారంగా వచ్చే జన్మ రహస్యం తెలుస్తోంది.గరుడ పురాణం ప్రకారం వచ్చే జన్మ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మహిళని చంపినవాడు లేదా స్త్రీకి గర్భస్రావం( Abortion ) చేసిన వాడు నరకయాతన అనుభవించవలసి ఉంటుందని గరుడ పురాణంలో ఉంది.అంతేకాకుండా ఆ వ్యక్తి తదుపరి జన్మ చండాల జన్మ అని గరుడ పురాణంలో ఉంది.
గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులను లేదా పిల్లలను ఇష్టపడని వారు తదుపరి జన్మలో భూమిపై పుట్టలేరు.భూమి మీద పుట్టాలంటే తల్లి కడుపులో ఉండగానే చనిపోతారు.
ఇంకా చెప్పాలంటే ఆడవారిని దోపిడీ లేదా హింసించే వ్యక్తి తన తదుపరి జన్మలో భయంకరమైన రోగాల బారిన పడి తన జీవితాన్ని శరీరక బాధతో గడుపుతాడు.అలాగే పరస్త్రీతో సంబంధాన్ని పెంచుకునే పురుషుడు వచ్చే జన్మలో బలహీనుడు అవుతాడు.గరుడ పురాణం ప్రకారం తమ జీవితకాలంలో ఎవరినైనా చంపడం, దోచుకోవడం లేదా జంతువులను వేటాడటం ద్వారా డబ్బు సంపాదించే వారు తమ తదుపరి జన్మలో కసాయి చేతికి చిక్కే మేక గా జన్మిస్తారు.ఇంకా చెప్పాలంటే తమ జీవితంలో మోసపూరిత మార్గాన్ని అనుసరించిన వారు వారి తదుపరి జన్మలో గుడ్లగూబ( Owl ) గా పుడతారు.
అమాయకులపై తప్పుడు సాక్ష్యం చెప్పేవారు వచ్చే జన్మలో అంధత్వానికి గురవుతారు.అలాగే గురువును గౌరవించని వారికి మరణం తర్వాత నరకంలో స్థానం లభిస్తుంది.
DEVOTIONAL