ఒంగోలులో వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి.నగరంలో పలు చలివేంద్రాల వద్ద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
అయితే ఆ ఫ్లెక్సీలలో సీఎం జగన్, మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫోటోలు ఎక్కడా కనిపించలేదు.కాగా ఈ ఫ్లెక్సీలలో బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి, జిల్లా అధికారుల ఫోటోలు కనిపించాయి.
అయితే ఈ చలివేంద్రాల ప్రారంభోత్సవానికి బాలినేని కూడా హాజరు కాలేదు.దీంతో అధికారులే ఈ చలివేంద్రాలను ప్రారంభించారు.
నగర కార్పొరేటర్లు బాలినేనికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.ఈ క్రమంలోనే విషయాన్ని గమనించిన కార్పొరేటర్లు సీఎం, మంత్రి ఫోటోలతో మళ్లీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.