మనలో చాలామంది జాతకాలను, జ్యోతిష్యాలను నమ్మడానికి ఇష్టపడరు కానీ కొందరి జీవితాలను పరిశీలిస్తే మాత్రం నిజమేనని నమ్మాల్సి వస్తుంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.
NTR ) కెరీర్ ను పరిశీలిస్తే ఆయనకు కొన్ని సందర్భాల్లో వరుస విజయాలు దక్కుతుండగా మరికొన్ని సందర్భాల్లో మాత్రం వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి.సింహాద్రి( Simhadri ) సినిమా నుంచి తారక్ కెరీర్ లో ఈ సెంటిమెంట్ మొదలైంది.
సింహాద్రితో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ సినిమాలతో నిరాశపరిచారు.రాఖీ కమర్షియల్ గా హిట్ అయినా కొంతమంది ఈ సినిమాను అబవ్ యావరేజ్ గానే పరిగణిస్తారు.
అయితే రాఖీ, యమదొంగ, కంత్రి, అదుర్స్, బృందావనం సినిమాలు ఎన్టీఆర్ తో సినిమాలు తీసిన నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి.
కంత్రి సినిమా ఆశించిన స్థాయి సక్సెస్ కాదని చాలామంది భావించినా కమర్షియల్ కలెక్షన్ల లెక్కల ప్రకారం ఆ మూవీని హిట్ గా పరిగణించాలి.ఆ తర్వాత శక్తి, ఊసరవెల్లి, దమ్ము సినిమాలతో తారక్ కు ఫ్లాపులు ఎదురయ్యాయి.బాద్ షా( Bad Shah ) హిట్టైనా ఓవర్ బడ్జెట్ వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది.
రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలు ఆయా సినిమాల నిర్మాతలకు భారీ షాకివ్వడం గమనార్హం.అయితే వరుస ఫ్లాపుల తర్వాత ఎన్టీఆర్ మళ్లీ కెరీర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్.ఆర్.ఆర్ లతో విజయాలు అందుకున్నారు.వరుసగా విజయాలు లేదా వరుసగా అపజయాలు ఎదురవుతున్న నేపథ్యంలో తారక్ తన సినిమా ఫ్లాప్ కాకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.సినిమాలకు సంబంధించి తారక్ జాతకం ఇతర హీరోలకు భిన్నంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.