ఊర్వశి రౌతేలా.( Urvashi Rautela )ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఏమి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం.ఆమె అందానికి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఇక ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియా( Social Media )లో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అందం విషయంలో అమ్మాయిలకి అసూయ తెప్పించే తన ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ కుర్రాళ్ళ కళ్ళ రాకుమారిగా వెలుగొందుతోంది.
ఆమెను చూసిన చాలా మంది స్త్రీలు ఆమె ఏం తింటుంది.ఆమె డైట్ ఏంటి.
ఆమె ఎటువంటి ఆహారం తీసుకుంటుంది అన్న సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి.
మరి ఊర్వశి రౌతేలా డైట్, అందం సీక్రెట్( Urvashi Rautela Diet ) ల విషయానికి వస్తే.కాగా ఊర్వశి రౌతేలా ఉదయాన్నే యోగా, ప్రాణాయామం ఎక్ సర్సైజ్‌లు( Yoga ) చేస్తుంది.యోగా చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో పాటు కండరాల బలం మెరుగుపడుతుంది.దాంతో మొత్తం శరీర భంగిమ ఇంప్రూవ్ అవుతుంది.స్ట్రెస్ కూడా తగ్గుతుంది.మరోవైపు ప్రాణాయామం ఎక్‌సర్సైజ్‌లు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.అలాగే ఊర్వశి వెయిట్ ట్రైనింగ్, కోర్ వర్కవుట్‌ల కోసం వారానికి మూడుసార్లు జిమ్( Gym )కి వెళుతుంది.
దాంతో నాజూకైన సొగసును ఆమె మెయింటైన్ చేయగలుగుతోంది.జిమ్ కీ వెళ్ళి అలానే కండరాల బలం, ఓర్పును పెంచుకుంటుంది.
ఈ వ్యాయామాలు చేస్తే కేలరీలను త్వరగా ఖర్చవుతాయి కాబట్టి ఈ బ్యూటీ ఎప్పుడూ హాట్ ఫిగర్‌తో కనిపిస్తుంది.అప్పుడప్పుడు డాన్స్ చేస్తూ కూడా క్యాలరీలను బర్న్ చేసుకుంటూ ఉంటుంది.ఇక ఆమె తినే స్నాక్స్ విషయానికి వస్తే.తాజా పండ్లు, బాదంపప్పు తింటూ ఉంటుందట.అలాగే తన బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్, ఎగ్ వైట్ ఆమ్లెట్, మల్టీ గ్రేయిన్ టోస్ట్( Oatmeal,Egg White Omlet ) తీసుకుంటుందట.ఈ ఆహారాల ఆమెకు ప్రోటీన్, ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే బ్యాలెన్స్‌డ్ మీల్ అందిస్తుంది.
ఎగ్ వైట్ ఆమ్లెట్ కండరాలు బలోపేతం కావడానికి దోహదపడుతుంది.అలానే ప్రోటీన్‌ను అందిస్తుంది.
ఓట్‌మీల్, మల్టీగ్రెయిన్ టోస్ట్ ఆమెను రోజంతా కడుపు నిండిన భావనతో, ఏకాగ్రతతో ఉండేలా చేస్తాయి.ఈమె మధ్యాహ్నం భోజనంలో పప్పు, రోటీ, బ్రౌన్ రైస్( Brown Rice ), కూరగాయలు ఆహారంగా తీసుకుంటుంది.