1.కేఏ పాల్ కామెంట్స్
తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని , ఏపీ ప్రజలు ఎందుకు గెలిపించరని 60 ,70% ప్రజలు ముఖ్యమంత్రిగా తననే కోరుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul )అన్నారు.
2.ఆయేషా మీరా హత్య కేసు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయోష మేర హత్య కేసులో సిబిఐ అధికారులు మరోసారి దర్యాప్తు చేస్తున్నారు.
3.బండి సంజయ్ కామెంట్స్
పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్( BJP Bandi Sanjay ) అన్నారు.
4.నారా లోకేష్ పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని బొల్లవరంలో నిర్వహిస్తున్నారు.
5.బోండా ఉమా విమర్శలు
ఫిట్ వ్యవహారంపై కొంతమంది పుడింగులు బయటికి వచ్చి మాట్లాడుతున్నారని , వీళ్లు నాలుగేళ్ల నుంచి ఏం పీకారు అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ వైసీపీ నాయకులను విమర్శించారు.
6.తిరుమల సమాచారం
భక్తుల రెడ్డి సాధారణంగా ఉంది రెండు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు.
7.పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేయండి
పరిశ్రమలకు చెల్లించాల్సిన పెండింగ్ ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఎం జగన్( CM YS Jagan ) కు ఏపీ ఛాంబర్స్ లేఖ రాసింది.
8.కోల్ ఇండియా సారధిగా పీఎం ప్రసాద్
దేశీయ బొగ్గు ఉత్పత్తి కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పీఎం ప్రసాద్ ఎంపికయ్యారు.
9.ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ ప్రారంభం
ఈరోజు ఢిల్లీలోని వసంత్ విహార్ లో నూతనంగా నిర్వహించిన టిఆర్ఎస్ భవన్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
10.సోషల్ మీడియా వేధింపులపై ప్రత్యేక విభాగం
సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుపడాలని, దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
11.జగన్ కు మంత్రి బొత్స కృతజ్ఞతలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినందుకు సీఎం జగన్ కు మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) కృతజ్ఞతలు తెలిపారు.
12.కూలిన ఆర్మీ హెలికాప్టర్
జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది.ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు ఉన్నారు .పైలట్ కో పైలట్ గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
13.పొంగులేటితో భేటీ ఈటెల రాజేందర్
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy )తో బీజేపీ చేరికలు కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు.
14.సోము వీర్రాజు విమర్శలు
హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( AP BJP Somu Veerraju ) విమర్శించారు
15.అకాల వర్షాలపై జగన్ సమీక్ష
ఏపీలో వర్షాలు అనంత పరిస్థితులపై అధికారులతో జగన్ సమీక్ష( YS Jagan Review ) నిర్వహించారు.ఈ సందర్భంగా వర్షాల కారణంగా పంట నష్టం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్న జగన్ రైతులకు పూర్తిస్థాయిలో పండగ నిలబడాలని అధికారులను ఆదేశించారు.
16.శ్రీశైలంలో చాప్టర్ ఫ్లైట్ కలకలం
ప్రముఖ దైవ క్షేత్రం శ్రీశైలంలో చాప్టర్ ఫ్లైట్ చెక్కర్లు కొట్టడం కలకలం రేపింది.
శ్రీశైలం మల్లన్న క్షేత్రం( Srisailam Mallanna Temple )లో చార్టెడ్ ఫ్లైట్ తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు
15.మేడారం జాతరకు తేదీలు ఖరారు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలను 2024 ఫిబ్రవరి 21 నుంచి , 24 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది
16.వివేక హత్య కేసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి( Avinash Reddy ) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది.దాంట్లో ఫోన్ కాల్ లిస్ట్ ను సీబీఐ బయట పెట్టింది.
17.చీకోటి ప్రవీణ్ కామెంట్స్
రాజకీయాల్లోకి వస్తున్నానని అనుమానంతోనే తనపై ఈ విధంగా టార్గెట్ చేసి థాయిలాండ్ లో అరెస్ట్ చేయించారని క్యాసినో కింగ్ గా పిలవబడుతున్న చీకోటి ప్రవీణ్( Cheekoti Praveen ) కామెంట్స్ చేశారు.
18.శరత్ బాబు ఆరోగ్యం పై బులిటెన్ విడుదల
ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమంగానే ఉందని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది.
19.బండి సంజయ్ కామెంట్స్
ఈరోజు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ భేటీ అవుతున్నారు అనే విషయం తనకు తెలియదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
20.సిపిఐ నారాయణ కామెంట్స్
30 మంది దత్తపుత్రులు దేశాన్ని దోచుకు పోతుంటే ప్రధాని మోదీ వారికి ప్రతినిధిగా ఉన్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు
.