కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెళగావి జిల్లా ఖానాపూర్ లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు.నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
బీజేపీ ప్రభుత్వం చేసిన మోసాన్ని గుర్తించిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.అంతేకాకుండా ఈ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.