బీజేపీపై ప్రియాంక గాంధీ విమర్శలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెళగావి జిల్లా ఖానాపూర్ లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు.

నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.బీజేపీ ప్రభుత్వం చేసిన మోసాన్ని గుర్తించిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.

అంతేకాకుండా ఈ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

బౌండరీలతో రెచ్చిపోయిన సమీర్ రిజ్వీ.. ప్రపంచ రికార్డుల మోత