ఇక ఉక్రెయిన్‌ రష్యా చేతిలో సమూలంగా నాశనం కాబోతోందా?

ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభం అయ్యి సంవత్సరం దాటిపోయింది.అయినా ఇరుదేశాలు ఎక్కడా తగ్గడంలేదు.

 Russian Army New Weapons In Ukraine War Updates,russia,ukraine,nato,russia-ukrai-TeluguStop.com

ముఖ్యంగా ఉక్రెయిన్ చెప్పుకోలేని స్థితిలో నష్టపోయింది.ఈ క్రమంలో రష్యాని ఎవ్వరూ ఊహించలేని విధంగా ఉక్రెయిన్ ఎదుర్కొంటోంది.

ఉక్రెయిన్ నాటోలో చేరతామని ప్రకటించిన విషయంలో రష్యాతో విబేధాలు రావడం అనేది ఇక్కడ ప్రధానమైన విషయం.అయినా ఇప్పటికీ ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం( Ukraine-NATO Relation ) అనేది ఇవ్వడం లేదు.

ఏవేవో కారణాలు చెబుతూ ఆ విషయాన్ని కాస్త దాటవేస్తున్నారు.

అయితే దీనిపై ఉక్రెయిన్( Ukraine ) రాయబారి బ్రిటన్ లో తాజాగా పర్యటించి అక్కడ కొన్ని కీలక విషయాలు చెప్పుకొచ్చారు.రాబోయే రోజుల్లో రష్యాపై తామే గెలుస్తామని, ఆ తర్వాత మీరు పిలిచి మమ్మల్ని నాటోలో చేరమని అడుగుతారని గొప్పలు పలికాడు.ఇదే విషయం ఇపుడు హాట్ టాపిక్ అయింది.

అయితే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యం రోజురోజుకు తిరిగిపోతోంది.ఉక్రెయిన్ రష్యా( Russia )పై ఇంకా పోరాడుతుందంటే దానికి కారణం కేవలం యూరప్ దేశాలు, అమెరికా ఇస్తున్న ఆయుధాల వల్లనే.

ఈ దేశాలు గనక ఆయుధాలు ఇవ్వక పోయి ఉంటే ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ ను స్వాధీనం పరుచుకునేది అని కొంతమంది అంటున్నారు.కాగా ఉక్రెయిన్ లో ఇప్పటికే మరియపోల్, కేర్సన్, డోనెట్క్సీ లాంటి నగరాలను కైవసం చేసుకుంది.ఈ తరుణంలో రష్యాను ఓడించి, తర్వాత నాటోలో చేరేట్లు చేస్తామని చెప్పడం ఒక రకంగా హస్యాస్పదం అని కొంతమంది రాజకీయ ఉద్ధండులు అభిప్రాయపడుతున్నారు.ఎందుకంటే, రష్యా అత్యధిక అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశం అని అందరికీ తెలిసినదే.

అది తలుచుకుంటే ఉక్రెయిన్ ను నామారూపాలు లేకుండా చేయగలదు.అయితే ఉక్రెయిన్ తాజా చర్యల నేపథ్యంలో రష్యా త్వరలోనే ఉక్రెయిన్ ని స్వాధీనం చేసుకోనుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube