ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం .. మేనకోడలితో సహోద్యోగికి పెళ్లి, సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి జైలు

తన సహోద్యోగికి ఇమ్మిగ్రేషన్ ( Immigration ) నిబంధనల్లో అనుకూలత కోసం తన మేనకోడలిని ఇచ్చి వివాహం చేసినందుకు గాను భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్ట్ ఆరు నెలల జైలు శిక్ష విధించింది.వివరాల్లోకి వెళితే.

 Indian-origin Man Jailed In Singapore For Arranging Sham Marriage Details, India-TeluguStop.com

మీరన్ గని నాగూర్ పిచ్చై (73)( Meeran Gani Nagoor Pitchai ) తన సహోద్యోగి , భారతీయుడైన అబ్దుల్ ఖాదర్ ఖాసీమ్ (55)తో( Abdul Kader Kasim ) ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న తన మేనకోడలు , భారత సంతతికి చెందిన నూర్జన్ అబ్ధుల్ కరీమ్ (58)ను( Noorjan Abdul Karim ) పెళ్లి చేసుకోవాల్సిందిగా 2016లో కోరాడు.అయితే ఇమ్మిగేషన్ నిబంధనలకు వీలుగా తన మేనకోడలిని అబ్ధుల్ ఖాదర్‌కు స్పాన్సర్‌గా వుండేలా మీరన్ ఏర్పాట్లు చేసినట్లు టుడే వార్తాపత్రిక బుధవారం నివేదించింది.

షార్ట్ టర్మ్ విజిట్ పాస్ కింద సింగపూర్‌లో వున్న దరఖాస్తుదారులు .దేశంలో ప్రవేశించిన నాటి నుంచి 89 రోజుల పొడిగింపు కావాలనుకుంటే స్థానిక స్పాన్సర్ అవసరం.ఈ క్రమంలో అబ్ధుల్ తన షార్ట్ టర్మ్ విజిట్ పాస్‌ను పొడిగించాలని అనుకున్నాడు.అదే సమయంలో నూర్జన్ ఆర్ధిక ఇబ్బందుల్లో వుంది.ఇందుకుగాను ఆమెకు 25 వేల సింగపూర్ డాలర్లను చెల్లించాడు.ఈ మొత్తంలో నూర్జన్ 1000 సింగపూర్ డాలర్లను తన మామ మీరన్‌కు ఇచ్చింది.

ఎందుకంటే నూర్జన్ మాజీ భర్త మీరన్‌కు బాకీ వున్నాడు.

Telugu Indian Origin, Meerangani, Noorjanabdul, Sham, Short Term, Singapore, Sin

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17, 2016న అబ్ధుల్ ఖాదర్, నూర్జన్‌ల వివాహం ఘనంగా జరిగింది.ఇదిలావుండగా ఆరేళ్ల తర్వాత 2022 సెప్టెంబర్ 28న మీరన్‌ను ఇమ్మిగ్రేషన్ అండ్ చెక్‌పాయింట్స్ అథారిటీ (ఐసీఏ) అధికారులు అరెస్ట్ చేశారు.ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాన్ని పొందేందుకు వీలుగా వివాహాన్ని జరిపించినట్లు అతనిపై అభియోగాలు నమోదు చేసింది.

ఈ కేసుకు సంబంధించి బుధవారం జరిగిన విచారణ సందర్భంగా ఐసీఏ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గణేశ్వరన్ ధనశేఖరన్ అభ్యర్ధన మేరకు మీరన్‌కు న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

Telugu Indian Origin, Meerangani, Noorjanabdul, Sham, Short Term, Singapore, Sin

బూటకపు వివాహాలు చట్ట విరుద్ధమని.ఈ తరహా పెళ్లిళ్లకు సంబంధించిన సాక్ష్యాలను వెలికి తీయడం కష్టమని టుడే వార్తా పత్రిక పేర్కొంది.సింగపూర్ చట్టాల ప్రకారం.

ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలను పొందేందుకు అనుకూలంగా వివాహాలు జరిపించిన కేసులో ఎవరైనా దోషిగా తేలితే.వారికి పదేళ్ల జైలు శిక్ష, 10 వేల సింగపూర్ డాలర్ల జైలు శిక్ష లేదా రెండు విధించబడతాయి.

ఈ కేసులో మీరన్‌తో పాటు అబ్ధుల్‌‌కు ఆరు నెలలు, నూర్జన్‌కు ఏడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube