టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే( Pooja Hegde ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పూజా హెగ్డే టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
గత ఏడాది వరకు వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో జోరుని పూర్తిగా తగ్గించేసింది.అందుకు గల కారణం ఆమెకు సినిమా అవకాశాలు తగ్గడమే అని చెప్పవచ్చు.
గత ఏడాది ఆమె నటించిన ఆచార్య,రాధే శ్యామ్, బీస్ట్( Acharya, Radhe Shyam, Beast ).ఈ మూడు సినిమాలు వరుసగా డిజాస్టర్లు కావడంతో కెరియర్ పరంగా ఆమె కాస్త స్లో అయింది.అంతేకాకుండా ఆ సమయంలో ఆమెను ఐరన్ లెగ్ అంటూ కూడా ట్రోల్స్ చేశారు.

అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం తగ్గడం లేదు.ప్రస్తుతం పూజ హెగ్డే సల్మాన్ ఖాన్( Salman Khan ) హీరోగా నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది పూజా హెగ్డే.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.కదా పూజ హెగ్డే ఈ సినిమాతో పాటు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 28( SSMB 28 ) సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
కదా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ప్రజెంట్ కమర్షియల్ హీరోయిన్‌గా కెరీర్ పరంగా హ్యాపీగానే ఉన్నాను.ఒకవేళ ఛాన్స్ వస్తే లేడీ ఓరియంటెడ్( Lady oriented ) సినిమాల్లోనూ నటించి ప్రూవ్ చేసుకోవాలను కుంటున్నాను అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.పూజా డైరెక్ట్‌గా రిక్వెస్ట్ చేసిన తరువాతైనా మేకర్స్ అలాంటి సినిమాలు ప్లాన్ చేస్తారేమో చూడాలి.
మరి పూజా హెగ్డే కోరికను మనసులోని మాటను ఎవరిని నెరవేరుస్తారో చూడాలి మరి.ఇకపోతే పూజ హెగ్డే మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత ఆమె ఏ సినిమాలో నటిస్తుందా అని అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని త్వరలోనే వాటిని అధికారికంగా కూడా ప్రకటించబోతున్నట్లు కూడా తెలుస్తోంది.
ఒకవేళ ఆమె నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్, మహేష్ బాబు సినిమా రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి అంటే ఈ ముద్దుగుమ్మకు మళ్ళీ అవకాశాలు క్యూ కడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.