Ravi Teja : ఆర్టీవో ఆఫీస్ లో రవితేజ.. వేలంపాటలో ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్న హీరో.. కారు ఖరీదెంతంటే?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రవితేజ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Ravi Teja Visit Khairtabad Rto Office His Car Registration-TeluguStop.com

ఇటీవలె ధమాకా,రావణాసుర( Dhamaka, Ravanasura ) సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలు విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

ప్రస్తుతం రవితేజ తదుపరి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ హైదరాబాదులోని ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో సందడి చేశారు.

రవితేజ కొత్త ఎలక్ట్రిక్ కార్ ( Electric car )ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.రవితేజ కొనుగోలు చేసిన ఈవీ ఎలక్ట్రిక్ కారు ధర రూ.34 అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా తన వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో ఆఫీస్ కు వెళ్లారు రవితేజ.

టీఎస్ 09 జీబీ2628 అనే ఫ్యాన్సీ నెంబర్ను దక్కించుకున్నారు.ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం రవితేజ రూ.17,628 వేలంలో దక్కించుకున్నారు.ప్రస్తుతం రవితేజ ఆర్టీవో కార్యాలయంలో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఏప్రిల్ ఏడవ తేది నా రవితేజ నటించిన రావణాసుర సినిమా విడుదలైన విషయం తెలిసిందే.సుధీర్ వర్మ ( Sudhir Verma )దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పర్య అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్ తో పాటు ఐదుగురు హీరోయిన్స్ నటించిన విషయం తెలిసిందే.క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ ఆ తర్వాత వరుసగా ఖిలాడీ,రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube