మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram charan Tej ) గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈయన శంకర్ ( Shankar )దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer Movie ) లో నటిస్తున్నారు.ఈ సినిమా దాదాపు 70 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.
మరికొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత సినిమాల విషయంలో రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
రామ్ చరణ్ ఉపాసన( Upasana )ల వివాహం జరిగి ప్రతి సంవత్సరాలు పూర్తి అయింది.ఇలా పది సంవత్సరాలు తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.ఈ క్రమంలోనే మెగా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అయితే ప్రస్తుతం ఉపాసన ఏడవ నెల గర్భిణిగా ఉన్నారు.అయితే మరి కొద్ది రోజులలో ఈమె బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ తనకు పుట్టబోయే బిడ్డ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్ పూర్తి అయ్యేలోపు ఉపాసన డెలివరీ తేదీ కూడా దగ్గర పడుతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఉపాసన కోసం పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చరణ్ 3 నెలల పాటు సినిమాలకు విరామం ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నారట.బిడ్డ పుట్టిన తర్వాత తనతో సమయం గడపడం కోసం రామ్ చరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.బిడ్డ పుట్టిన తర్వాత తండ్రిగా, భర్తగా తన భార్య బిడ్డ కోసం తన విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు.ఇలా బిడ్డ కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చారనే విషయం తెలియడంతో.
రాంచరణ్ బిడ్డ కోసం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంతో సరైనదని రామ్ చరణ్ నిర్ణయం పట్ల మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.