గుణ శేఖర్( Gunasekhar ) డైరెక్షన్ లో సమంత ( Samantha ) హీరోయిన్ గా చేసిన సినిమా శాకుంతలం ( Shaakuntalam ) ఈ సినిమాకి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించగా, నీలిమ గుణ నిర్మించారు.ఈ సినిమా ఏప్రిల్ 14న మన ముందుకు రాబోతుంది.
ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి .కొంతకాలంగా డిఫరెంట్ జానర్స్ టచ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది సమంత .ఇందులో భాగంగానే శాకుంతలం సినిమా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ బ్యానర్లపై దిల్ రాజు సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు.
సమంత కెరీర్ లో తొలి పౌరాణిక సినిమాగా తెరెక్కింది .
ఈ సినిమా ప్రీమియర్ షోలు వేయడం ఇప్పటికే ప్రారంభించారు.దిల్ రాజు తన స్ట్రాటజీ ఉపయోగించి పలు చోట్ల శాకుంతలం మూవీ ప్రదర్శించారు.అయితే ఈ ప్రివ్యూ షో చూసిన ఆడియన్స్ ఈ సినిమాపై పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు ఈ శాకుంతలం మూవీలో సమంత చాలా నాచురల్ గా నటించిందని, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు .ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా బాగుందనే టాక్ బయటకొచ్చింది.కడుపుతో ఉన్నపుడు శకుంతల బాధపడిన సీన్స్, ఆమె పడిన కష్టాలు ఈ సినిమాలో హైలైట్ సన్నివేశాలని అంటున్నారు.
సమంత యాక్టింగ్ ,త్రీడి ఎఫెక్ట్ బాగున్నాయని చెబుతున్నారు .
గ్రాఫిక్ వర్క్ సూపర్ అంటున్నారు.మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ నటనపై( Allu Arha ) ప్రశంసలు గుప్పిస్తున్నారు.తొలిసారి కెమెరా ముందుకొచ్చినా.
ఎలాంటి బెరుకు లేకుండా నటించిందని, సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది కొద్దిసేపే అయినా.తన యాక్టింగ్ తో సర్‌ప్రైజ్ చేసిందని అంటున్నారు.
అయితే కొందరు మాత్రం ఈ సినిమా యావరేజ్ అంటున్నారు.రొటీన్ సీన్స్ కాస్త బోర్ కొట్టించాయని చెబుతున్నారు.
ఏదిఏమైనా ఫైనల్ గా ఈ శాకుంతలం సినిమాకు ఓ పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు.గుణశేఖర్ టీం చేస్తున్న ప్రమోషన్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అవుతున్నాయి ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటించగా.
ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు.శాకుంతలం అనే పౌరాణిక గాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంతో అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ సినీ ఎంట్రీ ఇస్తోంది.ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, గౌతమి, మధుబాల, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు…ఇక ప్రేక్షకుల నుంచి స్పందన తెలియాలి అంటే ఏప్రిల్ 14 దాకా వెయిట్ చేయక తప్పదు…
.