ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.06
సూర్యాస్తమయం: సాయంత్రం 06.27
రాహుకాలం: మ.12.00 ల1.30 వరకు
అమృత ఘడియలు: ఉ.6.00 ల7.00 మ2.00 ల6.00 .
దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం:
ఈరోజు మీరు మొదలు పెట్టిన కొన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతాయి.అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
మిథునం:
ఈరోజు విద్యార్థులు ఇతర పనులపై కాకుండా మీ చదువుపై కూడా దృష్టి పెట్టడమే మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
కర్కాటకం:
ఈరోజు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.అనుకోకుండా మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
సింహం:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.
కన్య:
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి మీరు బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.మీ పాత స్నేహితులని కలుసుకుంటారు.
తులా:
ఈరోజు మీరు కొన్ని దూరప్రాణాలను చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.ప్రయాణాల్లో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.నూతన వస్తు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.
వృశ్చికం:
ఈ రోజు మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృథా చేయకండి.
ధనస్సు:
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.కొన్ని కొత్త పనుల ప్రారంభించే ముందు అనుభవమున్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు వింటారు.
మకరం:
ఈరోజు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొందరు మిమ్మలిని ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తారు.దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విషయాలలో ధైర్యంగా ఉండటం మంచిది.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
కుంభం:
ఈరోజు ఏ పని చేసిన కాస్త ఆలోచించి చేయాలి.లేదంటే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదురవుతాయి.ఏ విషయంలోనైనా సొంత నిర్ణయాలు తీసుకోకుండా అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం అవకాశం ఉంటుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీరు ప్రారంభించిన పనులు సక్రమంగా పూర్తవుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
మీరంటే గిట్టని వారు విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది.
LATEST NEWS - TELUGU