Elon Musk Goat Statue: ఎలాన్ మస్క్ గోట్ స్టాచ్యూ ఎన్ని రూ.కోట్లు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

టెస్లా సీఈఓ, ట్విట్టర్ యజమానికి నివాళిగా ఎలాన్ మస్క్ ఫ్యాన్స్ తాజాగా అతని విగ్రహాన్ని కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు.మస్క్‌కి ప్రపంచ నలుమూలల హాలీవుడ్ హీరోల కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

 Elon Musk Goat Statue Price Will Shock You Details, Elon Musk, Canada Fans, 30-f-TeluguStop.com

అతని గౌరవార్థం నిర్మించిన విగ్రహమే దీనికి నిదర్శనం.ఎలాన్ మస్క్ విగ్రహం ఎలా ఉందంటే రాకెట్‌ను నడుపుతున్న మేక లాగా ఉంది.

మేక తలకు మస్క్ తల జోడించారు.ఈ పెద్ద విగ్రహం చాలా దూరం నుంచి కూడా మంచిగా కనిపిస్తోంది.

దీనిని ఎలోన్ గోట్ అని పిలుస్తున్నారు.

దీని విలువ 6 లక్షల డాలర్లు (సుమారు రూ.4.8 కోట్లు) కాగా ఇది 30 అడుగుల పొడవు, 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉండి చాలామందిని ఆకర్షిస్తోంది.దీనిని కెనడియన్ శిల్పులు కెవిన్, మిచెల్ స్టోన్ రూపొందించారు.శిల్పం తల అల్యూమినియంతో తయారు చేశారు.నివేదిక ప్రకారం, ఎలాన్ మస్క్ విగ్రహం తయారు చేయాలనే ఆలోచనను మొదటగా క్రిప్టోకరెన్సీ సంస్థ ఎలాన్ గోట్ టోకెన్ ప్రారంభించింది.నవంబర్ 26న టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోని అతని టెక్సాన్ టెస్లాలో మస్క్‌కి విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది.

ఇంతలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొత్త బాస్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్విట్టర్ బ్లూ వెరిఫికేషన్ ప్లాన్ లాంచ్ చేశారు.కొంతమంది వినియోగదారులు ఇప్పటికే దీనిని దుర్వినియోగం చేస్తున్నారు.అలాగే మస్క్ ప్లాన్స్ కూడా చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి.దీంతో అతడి పై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube