Bike accident recording : బైక్‌పై స్పీడ్‌గా వెళ్లిన కపుల్.. కిందపడినా వీడియో రికార్డింగ్ ఆపని మహాతల్లి..

ఈ రోజుల్లో చాలామంది తమకు సంబంధించిన అన్ని వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు.రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఏదో ఒక సోది పెడుతూ వీడియోలు తీస్తున్నారు.

 Women Did Not Stop Recording The Video Of The Couple Who Went Fast On The Bike-TeluguStop.com

కాగా తాజాగా ఒక యువతి రోడ్డుపై వెళ్తూ యాక్సిడెంట్‌కి గురైంది.అయితే అంతకుముందు వరకు ఆమె ఫోన్‌తో వీడియో రికార్డ్ చేసింది.

అయితే ఆక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఆమె తన వీడియో రికార్డింగ్ గురించి ఆపకుండా మాట్లాడుతూనే ఉంది.తన పార్ట్‌నర్‌కి ఏమైనా గాయాలు అయ్యాయా అనేది కూడా ఆమె పట్టించుకోకుండా తన మానాన తాను వీడియో చేస్తూనే ఉంది.

పైగా ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.అది కాస్త వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక జంట మోటార్‌బైక్‌పై వేగంగా వెళ్లడం మీరు చూడవచ్చు.అయితే ఆ బైక్ వెనక కూర్చున్న ఒక మహిళ వీడియో రికార్డ్ చేస్తూ కనిపించింది.

ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది.ఇంతలోనే వేగంగా వెళ్లిన ఆ బైకు యాక్సిడెంట్ కి గురైంది దాంతో వీరిద్దరూ కింద పడిపోయారు.

తర్వాత ఆ మహిళ లేచి తన పార్ట్‌నర్ గురించి పట్టించుకోకుండా వీడియో కొనసాగించింది.

ఈ వీడియోకి 1.66 లక్షల వ్యూస్, 13.5 వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి.ప్రమాదానికి కారణం రైడర్‌యే అని.అందుకే అతడి పై కోపంతో అతడి గురించే ఆమె పట్టించుకోలేదని కొందరు నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.“నేను అతనిని నమ్మి రైడ్‌లో వచ్చానని ఆమె చెబుతోంది, కానీ అతనికి మొదట బైక్ నడపడం తెలియదట.” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ఈ ఫన్నీ వీడియోని మీరు కూడా వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube