బైక్‌పై స్పీడ్‌గా వెళ్లిన కపుల్.. కిందపడినా వీడియో రికార్డింగ్ ఆపని మహాతల్లి..
TeluguStop.com
ఈ రోజుల్లో చాలామంది తమకు సంబంధించిన అన్ని వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు.
రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఏదో ఒక సోది పెడుతూ వీడియోలు తీస్తున్నారు.కాగా తాజాగా ఒక యువతి రోడ్డుపై వెళ్తూ యాక్సిడెంట్‌కి గురైంది.
అయితే అంతకుముందు వరకు ఆమె ఫోన్‌తో వీడియో రికార్డ్ చేసింది.అయితే ఆక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఆమె తన వీడియో రికార్డింగ్ గురించి ఆపకుండా మాట్లాడుతూనే ఉంది.
తన పార్ట్‌నర్‌కి ఏమైనా గాయాలు అయ్యాయా అనేది కూడా ఆమె పట్టించుకోకుండా తన మానాన తాను వీడియో చేస్తూనే ఉంది.
పైగా ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.అది కాస్త వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక జంట మోటార్‌బైక్‌పై వేగంగా వెళ్లడం మీరు చూడవచ్చు.
అయితే ఆ బైక్ వెనక కూర్చున్న ఒక మహిళ వీడియో రికార్డ్ చేస్తూ కనిపించింది.
ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది.ఇంతలోనే వేగంగా వెళ్లిన ఆ బైకు యాక్సిడెంట్ కి గురైంది దాంతో వీరిద్దరూ కింద పడిపోయారు.
తర్వాత ఆ మహిళ లేచి తన పార్ట్‌నర్ గురించి పట్టించుకోకుండా వీడియో కొనసాగించింది.
"""/"/
ఈ వీడియోకి 1.66 లక్షల వ్యూస్, 13.
5 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.ప్రమాదానికి కారణం రైడర్‌యే అని.
అందుకే అతడి పై కోపంతో అతడి గురించే ఆమె పట్టించుకోలేదని కొందరు నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.
"నేను అతనిని నమ్మి రైడ్‌లో వచ్చానని ఆమె చెబుతోంది, కానీ అతనికి మొదట బైక్ నడపడం తెలియదట.
" అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.ఈ ఫన్నీ వీడియోని మీరు కూడా వీక్షించండి.
ఒహియో సెనేట్ సీటుపై వివేక్ రామస్వామి కన్ను? .. ట్రంప్‌తో మంతనాలు అందుకేనా?