Prime Video Buff: రోజంతా అదే పనిగా సినిమాలు చూసే అలవాటు ఉందా.. రూ.32 లక్షలు మీవే..

ఇంట్లో కూర్చుని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు, వెబ్‌సిరీస్ అదే పనిగా చూసే అలవాటు మీకుందా? అయితే రూ.32 లక్షలు గెలుచుకునే అవకాశం మీకు ఉంది.అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా సినిమాలు టీవీ షోలు రోజంతా చూసేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది.స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ‘టీవీ ఫ్రీక్’గా ఉండే ‘ప్రైమ్ వీడియో బఫ్’లకు భారీ ఎత్తున డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైంది.

 Prime Video Will Pay You 40k Dollars To Watch And Recommend Movies And Tv Shows-TeluguStop.com

సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఆల్రెడీ చూసే అలవాటు ఉన్నవారు తాము చెప్పినట్లు మూడు నెలల పాటు అదే పనిని కొనసాగిస్తే డబ్బులు ఇస్తామని అమెజాన్ ప్రకటించింది.

కొన్ని నెలల పాటు తమ కంటెంట్‌ను చురుకుగా చూడగలిగే.

వారి ఆలోచనలను పంచుకునే వారి కోసం అమెజాన్ కంపెనీ వెతుకుతోంది.ఈ ఆఫర్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే ఒక అర్హతను కలిగి ఉండాలి.

అదేంటంటే, మీరు ఆస్ట్రేలియాలో జీవిస్తూ ఉండాలి.ఈ ఆఫర్‌ను ప్రైమ్ వీడియో ఆస్ట్రేలియా తీసుకొచ్చింది.

అంటే ఇతర దేశాల నుంచి ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్లు ఈ ఆఫర్‌కు అనర్హులు.ఆస్ట్రేలియన్ ప్రేక్షకులు ఏమి చూడాలో రికమెండ్ చేయడమే అమెజాన్ కంపెనీ ప్రస్తుత లక్ష్యం.

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నిర్వహించిన కొత్త పరిశోధనలో 2022లో సగటు ఆస్ట్రేలియన్ 67 సినిమాలు, టీవీ సిరీస్‌లు చూశారని తేలింది.

సర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది సినిమా లేదా షోను ఎంచుకునేటప్పుడు AI సిఫార్సుల కంటే ఇతరులు చెప్పిన రికమండేషన్ పైనే తాము ఎక్కువగా ఆధారపడుతున్నట్టు తెలిపారు.ఆటోమెటిగ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలను రికమెండ్ చేయాలని ఉద్దేశంతో కంపెనీ వాటిని తెలుసుకొని వారికి చూపించనుంది.కస్టమర్‌లు సాధారణంగా ఎంచుకోని కొత్త కంటెంట్, జానర్‌లను కనుగొనడంలో సహాయం చేయడానికి పొద్దస్తమానం టీవీ షోలు, సినిమాలు చూస్తూ వాటిలో మంచి వాటిని మాకు సజెస్ట్ చేసే వారి కోసం మేం వెతుకుతున్నామని ప్రైమ్ వీడియో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ హెడ్ అన్నారు.సెలెక్టెడ్ అభ్యర్థికి మూడు నెలల వీక్షణ వ్యవధి కోసం 40,000 డాలర్ల (రూ.32 లక్షలు) వరకు సంపాదించవచ్చని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube