పార్లమెంట్ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం..!!

పార్లమెంట్ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Mallu Bhatti Vikramarka ) తప్పుకున్నారు.ఈ క్రమంలో ఇద్దరి నేతల బాధ్యతలను వేరే వారికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ అప్పగించారు.

 Telangana Cm, Deputy Cm Resigned From In-charge Of Parliament..!!  , ,telangana-TeluguStop.com

ఇందులో భాగంగా రెండు పార్లమెంట్ స్థానాలకు కొత్త ఇంఛార్జ్ లను ఆమె ప్రకటించారు.మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం బాధ్యతలను సంపత్ కుమార్ కు అప్పగించారు.

అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలను వేం నరేందర్ రెడ్డి, హైదరాబాద్ పార్లమెంట్ బాధ్యతలను ఓబేదుల్లా కొత్వాల్ మరియు సికింద్రాబాద్ పార్లమెంట్ బాధ్యతలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy)కి అప్పగించారు.అయితే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు వీలుగా పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube