అమెరికాలోని హ్యుస్టన్ నగరంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.ఒకే కాన్పులో ఆరుగురు శిశువులకి జన్మనిచ్చి అందరిని ఆశ్చర్య పరిచింది ఓ మహిళ.
హ్యుస్టన్ నగరంలో దెల్మా చియాకా అనే మహిళ ఆరుగురు పిల్లకి జన్మని ఇవ్వడం అక్కడి వైద్యులు నివ్వెర పోయేలా చేసింది.
అయితే పుట్టిన వారిలో నలుగురు మగపిల్లలు కాగా మరో ఇద్దరు ఆడపిల్లలు.
శుక్రవారం ఉదయం 4:50 నుంచి 4:59 మధ్య వారు జన్మించినట్లు తెలిపారు.అయితే ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతాయని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతానికి తల్లీ పిల్లల ఆరోగ్యం బాగుందని.ఆస్పత్రిలోని ప్రత్యేక విభాగంలో పిల్లల్ని వైద్యుల సంరక్షణలో ఉంచామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ఆమెకి పుట్టిన ఇద్దరు ఆరుగురు లో ఇద్దరు ఆడపిల్లలకి జినా, జూరియెల్‌గా పేర్లు కూడా పెట్టేశారు.