ఏపీలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.శాసనసభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు.
ఎమ్మెల్యే ఆనం తన అభిప్రాయాలు వెల్లడించడమే నేరమని వైసీపీ ప్రభుత్వం తనకు రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారని పవన్ కల్యాణ్ తెలిపారు.వైసీపీ ప్రభుత్వం తనకు రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారని విమర్శించారు.
ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే ఆనం ఆందోళన చెందుతున్నారని చెప్పారు.ఆనం ప్రాణ రక్షణ బాధ్యతను డీజీపీ తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు లేఖ రాసి ఏపీలోని పరిస్థితులను తెలియజేస్తామని పేర్కొన్నారు.
ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేదని వెల్లడించారు.కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ ఎందుకు మాట్లాడటం లేదని పవన్ ప్రశ్నించారు.
ఈ మేరకు ఎమ్మెల్యే ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.