జగన్ కోసం పీకే టీం కొత్త ఫార్ములా రెడీ చేసిందా?

వరుస ఓటములతో ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ప్రధాన ఎన్నికలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.ఆ దిశగా ఇప్పటికే పని పూర్తి చేసిన పార్టీ వ్యూహాత్మక సలహాదారు ఐ పాక్ టీం ఇప్పటికే వైసిపి కోసం ఓ కొత్త ఫార్ములా రెడీ చేశారంట.

 Pk Team Made New Formuula For Jagan In Ap, Prashant Kishor, Ys Jagan , Tdp, Ysrc-TeluguStop.com

వరుసగా ఎన్నికలలో గెలుస్తూ మంచి జోష్ మీద కనిపిస్తున్న తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ( Janasena ) కూడా తోడైతే వైసీపీకి( YCP ) ఇబ్బందులు తప్పవని, కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం , జనసేన పొత్తు పెటాకులు చేసే విధంగా సమీకరణాలను మార్చాలని ఐపాడ్ టీం ఇప్పటికే వైసీపీ నాయకత్వానికి నివేదించిందట.

Telugu Ap, Chandra Babu, Janasena, Pawan Kalyan, Prashant Kishor, Ys Jagan, Ysrc

తమకున్న బలమైన సోషల్ మీడియా సపోర్ట్ తో ఇప్పుడు కొన్ని కొత్త ఫార్ములాలను అమలు చేసే బాధ్యత సోషల్ మీడియా ఆర్గనైజర్లకు అప్పజెప్పిందట .దాని సారాంశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అజయంగా మారుతుందని, దానికి ఎదురులేదని ఒంటరిగా పోటీ చేసిన కూడా ఆ పార్టీ గెలుస్తుంది అంటూ తెలుగుదేశం( Telugu Desam Party ) అభిమానుల ముసుగులో సోషల్ మీడియాలో స్టేట్మెంట్లు పాస్ చేస్తారు.జనసేన పార్టీ ని అవమానపరిచేలా చులకన చేసేలా సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తల ను టార్గెట్ చేస్తారు.

ఈ రకంగా మనుషులను ఈగో హర్ట్ చేస్తూ పొత్తుకు వ్యతిరేకంగా తీవ్ర ఘర్షణలు జరిగే విదంగా పరిణామాలు సృష్టిస్తారు.తెలుగుదేశానికి జనసేనకు రెండు సామాజిక వర్గాలు పూర్తిస్థాయిలో కొమ్ముకాస్తున్న వేళ ఆ రెండు సామాజిక వర్గాల మధ్యలో చిచ్చుపెట్టే విధంగా తమ మార్క్ సీడింగ్ ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారు.

ఇలా ఎన్నికలు నాటికి రెండు కమ్యూనిటీ ల మధ్యన అగాధం సృష్టించడమే ఆ ప్లాన్ అని వార్తలు వస్తున్నాయి.

Telugu Ap, Chandra Babu, Janasena, Pawan Kalyan, Prashant Kishor, Ys Jagan, Ysrc

మరి ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని స్పష్టంగా ప్రకటించిన జనసేనాని ఆ దిశగా పొత్తుల వైపు ముందుకు వెళుతుంటే దాన్ని ఎదుర్కొనేందుకు సోషల్ మీడియాని ఉపయోగించుకుని ఆ పొత్తును చిత్తు చేయాలని పీకే టీం పార్టీకి దిశా నిర్దేశం చేసిందట .మరి తమ అధినేతను చిన్న మాటంటేనే తట్టుకోలేక సోషల్ మీడియాలో యుద్ధం చేసే జనసైనికులు ఇప్పుడు ఐపాక్ టీం వేస్తున్న ఎత్తులను ఎదుర్కోగలరా? లేక వారి ట్రాప్ లో పడతారా? అన్నది చూడాలి….ఇప్పుడిప్పుడే రాజకీయాలను వంట బట్టించుకున్న జనసైనికులు ఈ దిశగా తమను మార్చుకుంటే పీకే టీం ఎత్తుల్ని ఎదుర్కోవటం అంత కష్టం కాదు.

మరి పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube