జగన్ కోసం పీకే టీం కొత్త ఫార్ములా రెడీ చేసిందా?

వరుస ఓటములతో ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ప్రధాన ఎన్నికలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.

ఆ దిశగా ఇప్పటికే పని పూర్తి చేసిన పార్టీ వ్యూహాత్మక సలహాదారు ఐ పాక్ టీం ఇప్పటికే వైసిపి కోసం ఓ కొత్త ఫార్ములా రెడీ చేశారంట.

వరుసగా ఎన్నికలలో గెలుస్తూ మంచి జోష్ మీద కనిపిస్తున్న తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ( Janasena ) కూడా తోడైతే వైసీపీకి( YCP ) ఇబ్బందులు తప్పవని, కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం , జనసేన పొత్తు పెటాకులు చేసే విధంగా సమీకరణాలను మార్చాలని ఐపాడ్ టీం ఇప్పటికే వైసీపీ నాయకత్వానికి నివేదించిందట.

"""/" / తమకున్న బలమైన సోషల్ మీడియా సపోర్ట్ తో ఇప్పుడు కొన్ని కొత్త ఫార్ములాలను అమలు చేసే బాధ్యత సోషల్ మీడియా ఆర్గనైజర్లకు అప్పజెప్పిందట .

దాని సారాంశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అజయంగా మారుతుందని, దానికి ఎదురులేదని ఒంటరిగా పోటీ చేసిన కూడా ఆ పార్టీ గెలుస్తుంది అంటూ తెలుగుదేశం( Telugu Desam Party ) అభిమానుల ముసుగులో సోషల్ మీడియాలో స్టేట్మెంట్లు పాస్ చేస్తారు.

జనసేన పార్టీ ని అవమానపరిచేలా చులకన చేసేలా సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తల ను టార్గెట్ చేస్తారు.

ఈ రకంగా మనుషులను ఈగో హర్ట్ చేస్తూ పొత్తుకు వ్యతిరేకంగా తీవ్ర ఘర్షణలు జరిగే విదంగా పరిణామాలు సృష్టిస్తారు.

తెలుగుదేశానికి జనసేనకు రెండు సామాజిక వర్గాలు పూర్తిస్థాయిలో కొమ్ముకాస్తున్న వేళ ఆ రెండు సామాజిక వర్గాల మధ్యలో చిచ్చుపెట్టే విధంగా తమ మార్క్ సీడింగ్ ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారు.

ఇలా ఎన్నికలు నాటికి రెండు కమ్యూనిటీ ల మధ్యన అగాధం సృష్టించడమే ఆ ప్లాన్ అని వార్తలు వస్తున్నాయి.

"""/" / మరి ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని స్పష్టంగా ప్రకటించిన జనసేనాని ఆ దిశగా పొత్తుల వైపు ముందుకు వెళుతుంటే దాన్ని ఎదుర్కొనేందుకు సోషల్ మీడియాని ఉపయోగించుకుని ఆ పొత్తును చిత్తు చేయాలని పీకే టీం పార్టీకి దిశా నిర్దేశం చేసిందట .

మరి తమ అధినేతను చిన్న మాటంటేనే తట్టుకోలేక సోషల్ మీడియాలో యుద్ధం చేసే జనసైనికులు ఇప్పుడు ఐపాక్ టీం వేస్తున్న ఎత్తులను ఎదుర్కోగలరా? లేక వారి ట్రాప్ లో పడతారా? అన్నది చూడాలి.

ఇప్పుడిప్పుడే రాజకీయాలను వంట బట్టించుకున్న జనసైనికులు ఈ దిశగా తమను మార్చుకుంటే పీకే టీం ఎత్తుల్ని ఎదుర్కోవటం అంత కష్టం కాదు.

మరి పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి .

వీరందరూ పేరున్న సెలబ్రిటీలే.. కానీ తెర వెనుక నీచులు..??