ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా రష్మిక మందన్న ( Rashmika Mandanna ) హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘పుష్ప ది రైజ్‘ ( Pushpa The Rise ).ఈ సినిమా 2021 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కేవలం తెలుగులో మాత్రమే భారీ హైప్ తో రిలీజ్ అయ్యింది.అయితే హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే హడావిడిగా రిలీజ్ చేసారు.
కానీ ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అందుకుని ఏకంగా 100 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి తగ్గేదేలే అనేలా చేసింది.ఈ సినిమా హిట్ అవ్వడంతో వెంటనే సీక్వెల్ కూడా స్టార్ట్ చేసాడు సుకుమార్.
మరి పార్ట్ 2 ‘పుష్ప ది రూల్‘ ( P ushpa The Rule ) కోసం పాన్ ఇండియన్ వైడ్ గా ఎదురు చూస్తున్నారు.నిర్మాతలకు భారీ లాభాలను అందించిన ఈ సినిమాను ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ మరింత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఫ్యాన్స్ అంతా గత ఏడాదిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా షూట్ ఎట్టకేలకు రెండు నెలల క్రితం స్టార్ట్ అయ్యింది.తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో బన్నీ క్యారెక్టర్ కు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవుతుందని.ఆ ట్విస్ట్ కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది అని టాక్.
ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కలెక్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడని న్యూస్ వైరల్ అయ్యింది. పుష్ప 2 లో విజయ్ సేతుపతి అతిథి పాత్ర అయిన కలెక్టర్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది.మరి ఇదే నిజమైతే ఈ సినిమాకు ఈయన ప్లస్ అయ్యే అవకాశం ఉంది.మరి పార్ట్ 1 తో అలరించిన అల్లు అర్జున్ పార్ట్ 2 తో ఎంత మంది అభిమానం అందుకుంటాడో వేచి చూడాల్సిందే.