1.ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై సుప్రీంకోర్టు తీర్పు

ఎమ్మెల్యేలు కొనుగోలు కేసు పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.ఎమ్మెల్యేలు కొనుగోలు కేసు విచారణ ను హైకోర్టు సిబిఐ కు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ , తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో తీర్పు ఈ విధంగా వచ్చింది.
2.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనురాధ
టిడిపి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయవాడకు చెందిన పంచమర్తి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు.
3.పవన్ పై ఏపీ మంత్రి కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు.
4.చలో రాజ్ భవన్ కు ఏపీసిసి పిలుపు
ఆదాని ఆర్థిక నేరాలపై కమిటీ వేయాలంటూ చలో రాజభవన్ కు ఏపీ సీసీ అధ్యక్షుడు గిడుగు రుద్దార్రాజు పిలుపునిచ్చారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
5.ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు

ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్ర యూనిట్ ను అభినందించారు.
6.తిరుమల సమాచారం
తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
7.ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది.తెలంగాణలో రెండు, ఏపీలో 13 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.
8.కాంగ్రెస్ పై ప్రధాని విమర్శలు
కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు తనకు సమాధి తవ్వే పనిలో బిజీగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోది సంచలన వ్యాఖ్యలు చేశారు.
9.రేపు జనసేన అవిర్భావ సభ

రేపు మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది.ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.
10.విశాఖే రాజధాని
విశాఖ రాజధానిగా పరిపాలన కొనసాగుతుందని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు కూడా ఏపీ రాజధానిగా విశాకే ఉండబోతోందని వ్యాఖ్యానించారు.
11.కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ని తొలగించిన వైసీపీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవా దల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని వైసీపీ అధిష్టానం ఆ పదవుల నుంచి తొలగించింది.
12.రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి జరగనున్నాయి.
13.మైనార్టీ వర్గాల పెద్దలలో జగన్ సమావేశం

మైనార్టీ వర్గాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు .ఈ మేరకు ఆయా మతాల పెద్దలు, సంఘాల నాయకులతో జగన్ ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
14.అన్నవరం లో కంచి పీఠాధిపతి
నేటి నుంచి ఈ నెల 18 వరకు అన్నవరంలో జరిగే వివిధ కార్యక్రమాలలో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొననున్నారు.
15.లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

కదిరిలోని ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మ రథోత్సవం జరిగింది.కర్ణాటక తెలంగాణ నుంచి పెద్ద భక్తులు తరలించారు.
16.ఆర్య సమాజం వార్షికోత్సవం
నేడు గుంటూరు ఆర్య సమాజం 54 వార్షికోత్సవ ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి.
17.మంత్రి ఉషా శ్రీ చరణ్ ను భర్తరఫ్ చేయాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేసుకుంటున్నారని, స్వయంగా అనంతపురం జిల్లా కు చెందిన మంత్రి ఉషశ్రీ చరణ్ ఓటుకు వేయి పంపిణీ చేయాలని చెప్పారని , దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చిందని వెంటనే ఆమెను భర్తరఫ్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
18.చంద్రబాబు ఆగ్రహం
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలకు దిగకపోవడం దారుణమని టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
19.నలుగురు మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్ ల అరెస్ట్

ఏపీలో ని విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్ర వరం మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు.
20.కేసిఆర్ కు స్వల్ప అస్వస్థత
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
కడుపులో మంట, నొప్పితో బాధపడుతున్న కేసీఆర్ ను ప్రగతి భవన్ లో వ్యక్తిగత వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పరీక్షించారు.