బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి గురించి తెలియని వారెవ్వరూ లేరు.తన మాటలతో, అల్లర్లతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
పలు ఎంటర్టైన్మెంట్ షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తొలిసారిగా అదుర్స్ షోతో బుల్లితెరలో అడుగుపెట్టిన శ్రీముఖి ఆ తర్వాత పటాస్ షోలో యాంకరింగ్ చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
అలా ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.శ్రీముఖి ఏ షోలో అయినా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.దీంతో తనకు ఎనర్జిటిక్ యాంకర్ అని పేరు కూడా వచ్చింది.
గతంలో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని మరింత గుర్తింపు సంపాదించుకుంది.చివరి వరకు ఆటలో కొనసాగి రన్నరప్ గా నిలిచింది.ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
బుల్లి తెరపై మాత్రం యధావిధిగా తన యాంకరింగ్ జీవితాన్ని కొనసాగిస్తుంది.ఇప్పుడు ఏ ఛానల్లో చూసిన శ్రీముఖి బాగా కనిపిస్తుంది.
చాలావరకు బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది అని చెప్పాలి.
ఇక సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
నిత్యం తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను బాగా పంచుకుంటుంది.అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్స్ లు చేస్తుంది.
ఇక తన డాన్స్ వీడియో లను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అప్పుడప్పుడు ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పడుతుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు మొహమాటం లేకుండా సమాధానాలు చెబుతుంది.ఇక బాగా ఫోటో షూట్ చేయించుకుంటూ వాటిని కూడా పంచుకుంటుంది.అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు శ్రీముఖి కాస్త పద్ధతిగా కూడా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపడేలా చేస్తుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటో షూట్ లు చేయించుకోగా వాటిని తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.అందులో మంచి అవుట్ ఫిట్ ధరించగా.తన లుక్ తో స్టన్ అయ్యేలా చేసింది.
అంతేకాకుండా రకరకాల స్టిల్స్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఇక ఆ ఫోటోలు చూసి తన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.అచ్చం కొరియన్ అమ్మాయి లాగా ఉన్నావు అంటూ తన అందాన్ని పొగుడుతున్నారు.
ఇక మరికొందరు ఈసారి ఏవి కనిపించకుండా.అన్ని అందాలను దాచేసింది గా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.