టాలీవుడ్ స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అల్లు అర్జున్ సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్న కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ లైఫ్ లో జరిగే విషయాలను సైతం ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటాడు.
తాజాగా అల్లు అర్జున్ తన భార్యతో కలిసి దిగిన బ్యూటిఫుల్ ఫోటోనే షేర్ చేసుకున్నారు.
ఈ రోజు తమ పెళ్లి రోజు కావడంతో బన్నీ సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే పిక్ షేర్ చేసాడు.
ఈ స్నాప్ లో అల్లు అర్జున్ ఇంకా స్నేహ రెడ్డి ఇద్దరు కూడా నవ్వుతు బ్యూటిఫుల్ గా ఉన్నారు.అల్లు అర్జున్ ఈ పిక్ షేర్ చేస్తూ హ్యాపీ యానివర్సరీ క్యూటీ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఈ పిక్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టు కుంది.ఇక ఇదిలా ఉండగా ప్రెజెంట్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సుకుమార్ ఈసారి పాన్ ఇండియన్ నటీనటులను ఎంపిక చేసి ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాడు.ఈ సినిమా వీలైనంత ఫాస్ట్ గా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని సుక్కూ ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా చేస్తూనే అల్లు అర్జున్ మరో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.బన్నీ నెక్స్ట్ సినిమాను సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అనౌన్స్ చేసాడు.ఈ సినిమా అలా అనౌన్స్ చేసారో లేదో ఇలా అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.మరి ఈ సెన్సేషనల్ కాంబోను బాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థ టి సిరీస్ వారు భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.
చూడాలి ఈ కాంబో ఎలా ఉంటుందో.







