ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ విశేషతలు మీకు తెలుసా? అసలెక్కడుందో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో మీకు తెలుసా? అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది.అవును, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా, భారతదేశంలో కూడా అలాంటి పెద్ద స్టేషన్ లేదు.

 Do You Know The Features Of The World's Largest Railway Station? Do You Know Whe-TeluguStop.com

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ టైటిల్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ పేరుతో రిజిస్టర్ చేయబడింది.ఈ స్టేషన్ 1901 నుండి 1903 వరకు నిర్మించబడింది.

ఆ సమయంలో పెన్సిల్వేనియా, రైల్‌రోడ్ స్టేషన్‌తో పోటీపడేలా దీనిని రూపిందించారని ప్రతీతి.అయితే ఈ స్టేషన్ నిర్మాణం వెనుక ఓ ఆసక్తికరమైన కథ దాగి వుంది.

ప్రజలకు తెలియని అతి పెద్ద రైల్వే స్టేషన్‌కు సంబంధించిన సమాచారం ఇక్కడే.

Telugu Longest Railway, Master, Passengers, Track, Travel-Latest News - Telugu

కాగా ఈ రైల్వే స్టేషన్‌ను భారీ యంత్రాలు లేని కాలంలో నిర్మించడం విశేషం అని చెప్పుకోవాలి.ఈ భారీ రైల్వే స్టేషన్‌ నిర్మాణానికి సుమారుగా రెండు సంవత్సరాలుపట్టింది. US మీడియా నివేదికల ప్రకారం, ఈ రైల్వే స్టేషన్ అత్యంత పెద్దది.

దీన్ని నిర్మించడానికి ప్రతిరోజూ 10,000 మంది పనివాళ్ళు కలిసి పనిచేశారట.స్టేషన్ దాని పరిమాణానికి మాత్రమే కాకుండా దాని నిర్మాణం, రూపకల్పనకు కూడా ప్రసిద్ధి చెందింది.

స్టేషన్‌లో మొత్తం 44 ప్లాట్‌ఫారమ్‌లు ఉండడంతో ఏకకాలంలో అక్కడ 44 రైళ్లు ఆగుతాయి.

Telugu Longest Railway, Master, Passengers, Track, Travel-Latest News - Telugu

ఇక ఈ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్‌లో చాలా సినిమాల షూటింగ్ జరుగుతూ ఉంటుంది.ఇక ప్రపంచ దేశాల సంగతి అటుంచితే మన భారతదేశం గురించి మాట్లాడుకుంటే, దేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్ టైటిల్‌ను UPలోని మధుర రైల్వే స్టేషన్ దక్కించుకుంది.రైల్వే స్టేషన్ గుండా కనీసం 3 మార్గాలు ఉన్న ప్రదేశాలను జంక్షన్‌లు అంటారు.

ఈ విధంగా, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది.ఇంతకుముందు ఈ ఘనత ఖరగ్‌పూర్ స్టేషన్ పేరిట ఉండేది.కాగా ఇపుడు ఆ పేరు గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ఆక్రమించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube