వృద్ధురాలు టచ్ చేసింది పాపం... అంతే, రూ.34 లక్షలు హుష్ కాక్!

తెలియకుండా జరిగిన తప్పుల వలన కూడా ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.అందుకనే కొన్ని కొన్ని చోట్లకి మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం.

 It's A Pity That The Old Lady Touched It That's It, Rs.34 Lakh Hush Cock, Old W-TeluguStop.com

మరీ ముఖ్యంగా ఏదైనా గిఫ్ట్ కొనడానికి గిఫ్ట్ షాప్ కి వెళ్ళినపుడు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి.షోకేసీలో వున్న బొమ్మల్ని చూసి టెంప్ట్ అయ్యి ఇష్టం వచ్చినట్టు తాకితే మొదటికే మోసం వస్తుంది.

అవును, ఇక్కడ వున్న కధనాన్ని ఒకసారి చదివితే మీకే అర్ధం అవుతుంది.అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయేది గిఫ్ట్ షాప్ గురించి కాదు గాని, సుమారు అలాంటిదే.

అమెరికాలోని మియామీలో చోటు చేసుకున్న ఈ విషయం తాజాగా వెలుగు చూసింది.ఓ అవ్వకు వచ్చిన అనుమానానికి ప్రముఖ పాప్ కళాకారుడు జెఫ్ కూన్స్ రూపొందించిన ఓ కళాఖండం రెప్పపాటులో పగిలిపోయింది.కాగా దీని విలువ 42,000 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.34 లక్షలు రూపాయిలు.ఇటీవల మియామిలోని ‘ఆర్వైనైన్ ఉడ్’ అనే ప్రదర్శనశాలలో VIP ప్రివ్యూ కార్యక్రమం నిర్వహించగా అక్కడికి కళాఖండాలను సేకరించే ఓ వృద్ధురాలు కూడా హాజరైంది.ఆమె అక్కడ జెఫ్ కూన్స్కు చెందిన ప్రముఖ ‘బెలూన్ డాగ్’ సిరీస్లోని నీలం రంగు బొమ్మను చూసింది.

ఆ తరువాత ఆమె మనసులో ఏమనుకుందోగానీ.ఆ బొమ్మను మొదట చాలా మెల్లగా తట్టి చూసింది.తరువాత ఎదో అనుమానంతో కాస్త గట్టిగా టచ్ చేసింది.దాంతో ఆ గాజు బొమ్మ ఒక్కసారిగా నేలపై పడి చెక్కచెక్కలైంది.అయితే ఆమె దానిని ఓ సాధారణ బొమ్మ అని అనుకుంది.కానీ అది అత్యంత విలువైనదని తెలుసుకొని చాలా బాధపడింది.అనుకోకుండా జరగడంతో ఆమె చాలా చింతించింది.ఈ విషయమై అక్కడే ఉన్న మరో కళాకారుడు గామ్సన్ మీడియాతో మాట్లాడుతూ.బహుశా ఆమె ఆ బొమ్మను చూసి గాలి బుడగలు అనుకొని టచ్ చేసి ఉంటుందని చెప్పాడు.అయితే అదృష్టవశాత్తూ ఆమెని సదరు నిర్వాహకులు ఏమి అనలేదు.

సదరు వృద్ధురాలు కావాలని దానిని పగులగొట్టలేదని నిర్ణయించుకొని వదిలేసారు.కానీ మనదగ్గర అలా జరిగితే ఏం జరుగుతుందో మీకు తెలిసే ఉంటుంది కదా!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube