గత కొద్దిరోజులుగా ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ మద్ధతుదారులు వీరంగం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.హిందూ దేవాలయాలను టార్గెట్ చేసి వాటిపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు, భారత వ్యతిరేక రాతలను రాస్తున్నారు.
ఇది మరింత తీవ్రస్థాయికి చేరుకుని ఏకంగా తోటి భారతీయులపైనే ఖలిస్తాన్ మద్ధతుదారులు దాడికి పాల్పడ్డారు.భారత జాతీయ పతాకాలను పట్టుకున్న వారిని చితకబాదడంతో పాటు కత్తులతో బెదిరించారు.
మన జెండా కర్రల్ని ధ్వంసం చేశారు.ఈ చర్యలపై ఆస్ట్రేలియాలోని భారతీయ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేవాలయాలను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది.
ఇలాంటి ఘటనల గురించి విన్న ప్రతీసారి అది తమను ఆందోళనకు గురిచేస్తోందని సిడ్నీకి చెందిన ఓ భారతీయుడు ఆవేదన వ్యక్తం చేశాడు.హిందువైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా మనమందరం ఒక్కటేనని ఆయన అన్నారు.ఒకరికొకరు మద్ధతుగా వుండాలని ఆ వ్యక్తి మీడియాతో అన్నాడు.
సమస్యలను సృష్టించే వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సదరు భారతీయుడు డిమాండ్ చేశాడు.మరో భారతీయుడు మీడియాతో మాట్లాడుతూ.
తమది బహుళ సాంస్కృతిక దేశమని ప్రభుత్వం చెబుతోందని.అయితే వారు దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని , హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాడు.
ఇదిలావుండగా.జనవరి 15న ఖలిస్తాన్ మద్ధతుదారులు మెల్‌బోర్న్‌లో కార్ ర్యాలీ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణకు మద్ధతు పొందేందుకు ప్రయత్నించారు.అయితే దాదాపు 60 వేల మంది వున్న మెల్‌బోర్న్ కమ్యూనిటీ నుంచి ఈ కార్యక్రమానికి 200 లోపే ప్రజలు హాజరవ్వడంతో వారి ప్రయత్నం విఫలమైంది.మరోవైపు.ఈ ఘటనల నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని భారత హైకమీషనర్ మన్‌ప్రీత్ వోహ్రా భారత వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల దేవాలయాలను సందర్శించారు.అనంతరం విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్‌ను కూడా కలిశారు.
ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన డేనియల్‌తో చర్చించారు.ప్రజల మధ్య అసమానతలను సృష్టిస్తున్న ఖలిస్తానీ గ్రూపులను దేశంలోనికి అనుమతించరాదని వోహ్రా ఈ సందర్భంగా అన్నారు.